(డిసెంబర్ 14తో ‘ఆవారా’కు 70 ఏళ్ళు పూర్తి) నటునిగానే కాదు, దర్శకునిగానూ రాజ్ కపూర్ తనదైన బాణీ పలికించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాలలో సామాన్యుని పక్షం నిలచి, అతని చుట్టూ అలుముకున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపించారు. పురాణగాథల్లో భార్యను అనుమానించి, పరిత్యజించిన వైనాన్ని ప్రశ్నిస్తూ, అలా బయటకు పంపిన భార్య, ఆమె పిల్లల పరిస్థితి ఏంటి అని అడుగుతూ రాజ్ కపూర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఆవారా’. ఈ సినిమాలో నటించి, […]
(డిసెంబర్ 14న ఆది పినిశెట్టి బర్త్ డే)ఆరడుగులకు పైగా ఎత్తు, చక్కని శరీరసౌష్టవం- అటు ప్రతినాయకునిగానైనా అలరించగల నేర్పు, ఇటు కథానాయకునిగానూ మెప్పించగల ఓర్పు రెండూ ఉన్నాయి ఆది పినిశెట్టిలో. చూడగానే ఇట్టే ఆకట్టుకొనే రూపంతో ఆది పినిశెట్టి తనకు లభించిన పాత్రలకు న్యాయం చేసుకుంటూ సాగుతున్నారు. ఆది తండ్రి రవిరాజా పినిశెట్టి దర్శకునిగా తనదైన బాణీ పలికించారు. ఆది మాత్రం నటునిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఇప్పటికే పలు చిత్రాలలో విలక్షణమైన పాత్రల్లో సలక్షణంగా […]
(డిసెంబర్ 14న రానా దగ్గుబాటి పుట్టినరోజు)కాలం కలసి వస్తే – జాలం భలేగా ఉంటుందని అంటారు. స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు ఇంట జూనియర్ రామానాయుడుగా జన్మించిన రానా అలాంటి లక్కీ మేన్ అని చెప్పవచ్చు. దగ్గుబాటి నట కుటుంబంలో మూడో తరానికి చెందిన వారు రానా. తాత రామానాయుడు కొన్ని చిత్రాలలో నటునిగా కనిపించగా, బాబాయ్ వెంకటేశ్ స్టార్ హీరోగా అలరించారు. వారి బాటలోనే రానా కూడా నటనలో అడుగు పెట్టి అనతికాలంలోనే తనదైన బాణీ పలికించారు. […]
రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. మరోసారి విశ్వ వేదికపై భారతీయ అందం మెరిసింది. పంజాబ్ అమ్మాయి హర్నాజ్ కౌర్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇజ్రాయెల్‌లోని ఇలాట్‌లో అట్టహాసంగా సాగిన మిస్ యూనివర్స్ పోటీలలో 80 దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి టైటిల్ విజేతగా నిలిచింది. భారతీయ యువతి చివరిసారిగా 2000లో మిస్ యూనివర్శ్ గెలుచుకుంది. 1994లో తొలిసారి సుస్మితాసేన్ విశ్వసుందరిగా ఎంపిక కాగా, 2000లో లారా దత్తా మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుంది. 21 […]
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఓ రోజు పెరుగుతూ… ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,187 శాంపిల్స్ పరీక్షించగా… 190 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో కరోనా బాధితుడు మృతి చెందారు. ఇదే సమయంలో 198 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,78,478 […]
పీఆర్సీ పై ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని.. ముఖ్యమంత్రి జగన్ తమ డిమాండ్లు పరిష్కారం చేస్తారనే నమ్మకం ఉందని వెల్లడించారు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు. ప్రభుత్వం నుంచి మా డిమాండ్ల పై ఎటువంటి స్పందన లేకపోవడం నిరసన కార్యాచరణ ప్రారంభించామని.. సీఎస్ నేతృత్వంలో పీఆర్సీ పై నివేదిక వెల్లడించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమస్య ముఖ్యమంత్రి స్థాయిలో పరిష్కారం కావాల్సిందేనని.. 1-07-2018 నుంచి ఫిట్ మెంట్ ఇవ్వాల్సి ఉండగా… నివేదికలో ఈ ఏడాది […]
పీఆర్సీ పై ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ప్రకటన చేశారు. పీఆర్సీ నివేదికపై అధ్యయనంపై అధికారుల కమిటీ వివిధ సందర్భాల్లో భేటీ అయ్యామని.. తమ సూచనలను సీఎం జగన్ కు నివేదించామని వెల్లడించారు. నివేదికలోని 11 అంశాలను అమలు చేయాలని.. 5 అంశాలను మార్పులతో అమలు చేయాలని.. 2 అంశాలు అమలు చేయనక్కర్లేదని సూచించామని సీఎస్ పేర్కొన్నారు. మూడు రోజుల్లోగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పీఆర్సీ పై నిర్ణయం తీసుకుంటారన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, సచివాలయ […]
సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉద్యోగాలు సీఎం మాకొద్దు అంటూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ”ఈ ఏడాది కూడా నిరుద్యోగ యువతను మోసం చేసినవ్ కదా కేసీఆర్.రాష్ట్రంలో 39% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఒక్క ఉద్యోగం నింపింది లేదు. నోటిఫికేషన్లు లేక వందల మంది నిరుద్యోగులు చనిపోతుంటే మీలో చలనం లేదు. మిమ్మల్ని కుర్చీ దించితే గానీ మా బిడ్డలు ఉద్యోగాలు ఎక్కరు. ఉద్యోగాలు ఇవ్వని సీఎం మనకొద్దు.” […]
రెజీనా కసాండ్ర, సుబ్బరాజు, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘బ్రేకింగ్ న్యూస్’. సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. డిసెంబర్ 13న రెజీనా పుట్టిన రోజు కావడంతో యూనిట్ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేయించి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రా ఎంటర్‌టైన్మెంట్స్, మ్యాంగో మాస్ మీడియా అధినేతలు మాట్లాడుతూ, ”సోషల్ సెటైరికల్‌గా ప్రస్తుత కాలమాన పరిస్థితులపై వాస్తవిక కోణంలో.. ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైరెక్టర్ […]
దక్షిణాఫ్రికాలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వేరియంట్ 66 దేశాలకు పైగా పాకేసిందని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈ వేరియంట్ కారణంగా.. ఎవరూ మరణించలేదని.. సంబరపడుతున్న జనాలకు ఊహించని షాక్ తగిలింది. తాజాగా యూకే లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు అయింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది బ్రిటన్ ప్రభుత్వం. ఇవాళ ఉదయమే ఒమిక్రాన్ సోకిన రోగి.. […]