ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లకు ముఖ్యమంత్రి జగన్ వేరు వేరుగా లేఖ రాశారు. తెలంగాణతో ఉన్న జల పంచాయతీ పై ప్రధాని మోడీకి ఐదు పేజీల లేఖ రాశారు జగన్. అంతేకాదు.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి రాసిన మూడు లేఖలు, తెలంగాణ జెన్ కో కు రాసిన లేఖ, విద్యుత్ ఉత్పత్తి కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన […]
కరోనా మహమ్మారి కారణంగా కొన్ని పరీక్షలు రద్దు కాగా.. మరికొన్ని పోటీ పరీక్షలను వాయిదా వేస్తూ వస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. లాక్‌డౌన్ నేపథ్యంలోనూ మరికొన్ని పరీక్షలు వాయిదా పడుతున్నాయి.. ఇక, ఆగస్ట్‌లో జరగనున్న ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది ప్రభుత్వం.. ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తులను ఎలాంటి అపరాద రుసుం లేకుండా ఈ నెల 8వ తేదీ వరకు స్వీకరించనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు.. లాక్‌డౌన్ కారణంగా.. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. వరుసగా జిల్లాల పర్యటన చేస్తున్న సీఎం కేసీఆర్…. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 4న సిరిసిల్లకు రానున్నారు సీఎం కేసీఆర్. ఈ పర్యటనలో సిరిసిల్ల నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు ఇవ్వనున్న కేసీఆర్…. సిరిసిల్ల నూతన కలెక్టరేట్, నర్సింగ్ కళాశాలను ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు మొదలు పెట్టింది జిల్లా అధికార యంత్రాంగం. కాగా..మాజీ మంత్రి ఈటెల […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 869 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 08 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 1197 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. read also :హైదరాబాద్ లో మరోసారి భారీగా పట్టుబడ్డ డ్రగ్స్ దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,24,379 కు చేరగా.. రికవరీ […]
హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 10 లో నివాసంపై ఇవాళ ఎక్సైజ్ పోలీసుల దాడి చేశారు. ఈ సందర్భంగా డ్రగ్స్ ముఠాలోని ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు… వీరి వద్ద నుండి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 17 గ్రాముల కొకైన్ తో పాటు, 8 గ్రాముల ఎండిఎంఏ, 73 ఎస్టకి పిల్స్, 15 గ్రాముల చరాస్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. […]
తెలంగాణాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. లాక్‌డౌన్ ఎత్తేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలు ఎప్పటిలా కొనసాగుతున్నాయి. GHMC కౌన్సిల్ సమావేశం మాత్రం ఆన్‌లైన్‌లో నిర్వహించారు. అన్‌లాక్‌లో ఎందుకు వర్చువల్ మీటింగ్ పెట్టారు? విపక్షాల విమర్శలేంటి? ఆన్‌లైన్ కౌన్సిల్ మీటింగ్ లోగుట్టు ఏంటి? వర్చువల్‌గా ముగిసిన జీహెచ్‌ఎంసీ తొలి కౌన్సిల్ భేటీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా GHMC కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. కౌన్సిల్‌లో విస్తృతంగా చర్చించి ఆయా అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. […]
పార్టీ అధికారంలో లేకపోయినా.. ఆ నియోజకవర్గంలోని పార్టీ నేతల మధ్య వర్గపోరు మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. కేడర్‌కు సర్దిచెప్పలేక సతమతం అవుతున్నారట అక్కడ ఎమ్మెల్యే. ఊరిలో పల్లకీ మోత.. ఇంట్లో ఈగల మోతగా మారి ఇబ్బంది పడుతున్నారట. చివరకు ఇంటిపోరు భరించలేక నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఎమ్మెల్యే వీరయ్య చెప్పినా వినని పార్టీ కేడర్ పొదెం వీరయ్య. భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇప్పుడు కొత్తగా […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతుంది. తాజాగా రాష్ట్రంలో 3,841 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,93,354 కి చేరింది. ఇందులో 18,42,432 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 38,178 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 38 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,744 కి చేరింది. ఇకపోతే గడిచిన […]
అన్నవరం ఆలయంలో రెండు దశాబ్దాలుగా ఆయన చెప్పిందే వేదమట. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నా.. ఆయన మాటకు తిరుగే లేదట. రిటైరైన మరుసటిరోజే కొత్త పదవి చేపట్టి.. పెత్తనం చేయడానికి వస్తున్నారని ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ రత్నగిరి కొండపై ఈ కొత్త రగడ ఏంటి? వ్రత పురోహితులకు కామేశ్వరరావు చెప్పిందే వేదం ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఉద్యోగులతోపాటు.. అర్చకులు.. పురోహితులు.. సిద్ధాంతులు.. ఇలా ఎంతో మంది.. ఎన్నో విభాగాలు ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం […]