తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 858 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 09 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 996 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. read aslo : మండల, జిల్లా పరిషతుల్లో ‘స్పెషల్’ పాలన మళ్లీ పొడిగింపు.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన […]
ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ దారుణమైన రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. జూన్ 26 తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని నెల్లూరులోని మెడికవర్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడ పరిస్థితి విషమించడంతో వెంటనే ఆయన్ని చెన్నైకి తరలించారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. read also :కాంగ్రెస్ లో గెలిచి… అమ్ముడుపొయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలి : రేవంత్ […]
కాంగ్రెస్ కొత్త పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి కాంగ్రెస్ నుంచి గెలిచి.. టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు రేవంత్. కాంగ్రెస్ లో గెలిచి అమ్ముడుపొయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని… అలా కొట్టడంలో తాను ముం దుంటానని మండిపడ్డారు రేవంత్. కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే అధికార పార్టీకి అమ్ముడుపోయే సన్నాసులకు సిగ్గు ఉండాలని.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యే లపై చర్యలు తీసుకో కుంటే… అవసరమైతే […]
జల వివాదం నిన్న ప్రధాని మోడీ లేఖ రాసిన ఏపీ సీఎం జగన్.. ఇవాళ ‘దిశ’ ఆమోదం కోసం కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఆరు పేజీల లేఖ రాశారు సీఎం జగన్. మహిళలు, పిల్లల పై లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో వీరి భద్రత కోసం దిశ చట్టం తీసుకుని వచ్చామని లేఖలో పేర్కొన్నారు. read also : జల వివాదంపై మేం […]
జలవివాదంపై మరోసారి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. తమ వైపు నుంచి పూర్తి సంయమనంతో ఉన్నామని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం భంగం కలగకుండా, పక్క రాష్ట్రంతో అనవసర వివాదాలు ఉండకూడదన్నదే తమ విధానామని పేర్కొన్నారు. కనీస నీటి మట్టం లేకుండానే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని.. రాయలసీమ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉభయ రాష్ట్రాలకు ఉందని గతంలో కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. read also : కొత్త పెళ్లి కూతురుకు ఈడీ […]
పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో హైపవర్ కమిటీ ఏర్పాటు చేశామని…మూడు, నాలుగు రోజుల్లో కమిటీ నివేదిక ప్రభుత్వానికి వస్తుందన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. కమిటీ సూచనలు మేరకు విద్యార్థులకు మార్కులు ప్రకటిస్తామని.. విద్యార్థుల భవిష్యత్ కి ఇబ్బందులు లేకుండా ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. ఈనెలాఖరు లోపు విద్యార్థులకు ఫలితాలు ప్రకటిస్తామని… ఆగస్టులో సెట్ ఎగ్జామ్స్ యథాతదంగా జరుగుతాయని… ఆగస్టు రెండో వారం కల్లా విద్యా సంవత్సరం ప్రారంభిస్తామని వెల్లడించారు […]
రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. కొత్త బిచ్చగాళ్ళు కెసిఆర్ నుంచి గుంజుకునుడే అంటున్నారని.. గుంజుకోవడానికి ఎవని అబ్బ సొత్తు కాదని..వాని అబ్బ సొత్తు అసలే కాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మూతి లేదు తోక లేదు అన్నట్టు ఉంది రేవంత్ తీరు ఉందన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేసిన వారి పై సైబర్ క్రైమ్స్ విభాగానికి ఫిర్యాదు చేశానని…చివరి శ్వాస ఉన్నంత వరకు టీఆర్ఎస్ తోనే ఉంటానని ప్రకటించారు దానం. […]
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ (హెరాయిన్) పట్టుబడింది. కాబూల్ నుండి ఢిల్లీ వచ్చిన ఆఫ్గన్ ప్రయాణీకుడి నుండి 2.4 కోట్ల విలువ చేసే 355 గ్రాముల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా మాదకద్రవ్యాలను సినీ పక్కీలో తరలించే యత్నం చేశాడు ఆ కేటుగాడు. మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు కనిపెట్టకుండా కారు ఇంజన్ లో వాడే పరికరాలలో దాచాడు. read also : తెలకపల్లి రవి […]
చైనా కమ్యూనిస్టుపార్టీ శతవార్షికోత్సవ వేడుకలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ఈనాటి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాన్ని ఒక పార్టీ వందేళ్లపాటు నడిపించడం, సోవియట్ యూనియన్ విచ్చిన్నమైన తర్వాత కూడా సోషలిస్టు విధానం తమదంటూ కమ్యూనిస్టుల నాయకత్వంలో అమెరికాకు దీటుగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థితిలో వుండటం చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రత్యేకత. ఆసియాలో అత్యంత ప్రాచీన చరిత్ర, నాగరికతగల దేశం చైనా. అసమర్ధ చక్రవర్తుల పాలనలో విదేశీ శక్తులు తిష్టవేశాయి. అది స్థానిక యుద్ధ ప్రభావాల ఘర్షణలకు రంగస్థలమైంది. […]
అమరావతి : ఏపీలో సేంద్రియ వ్యవసాయ పాలసీ పై కసరత్తు చేస్తోంది జగన్ సర్కార్. ఈ నేపథ్యంలోనే ఆర్గానిక్ ఫార్మింగ్ కమిటీతో సమావేశమయ్యారు మంత్రి కన్నబాబు. ఇందులో భాగంగానే బయో ఫెర్టిలైజర్స్ , పెస్టిసైడ్స్, ఇతర రసాయనాల వినియోగంపై మంత్రి, కమిటీ సభ్యుల చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ… త్వరలోనే ఆర్గానిక్ పాలసీని తీసుకొస్తామని.. సంబధిత శాఖల సూచనలు, అభిప్రాయాలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సేంద్రియ […]