కాంగ్రెస్ కొత్త పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి కాంగ్రెస్ నుంచి గెలిచి.. టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు రేవంత్. కాంగ్రెస్ లో గెలిచి అమ్ముడుపొయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని… అలా కొట్టడంలో తాను ముం దుంటానని మండిపడ్డారు రేవంత్. కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే అధికార పార్టీకి అమ్ముడుపోయే సన్నాసులకు సిగ్గు ఉండాలని.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యే లపై చర్యలు తీసుకో కుంటే… అవసరమైతే స్పీకర్ పై చర్యలకు కూడా న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.
read also : కేంద్రమంత్రికి సీఎం జగన్ లేఖ మరో లేఖ..
పశువులను కొన్నట్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ కొన్నాడని…అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు పదవికి రాజీనామ చేసి దమ్ముంటే ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు రేవంత్. తెలంగాణ ఇచ్చింది సొనియా…. ప్రజలకు సొనియాపై నమ్మకం ఉందని పేర్కొన్నారు.