జల వివాదం నిన్న ప్రధాని మోడీ లేఖ రాసిన ఏపీ సీఎం జగన్.. ఇవాళ ‘దిశ’ ఆమోదం కోసం కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఆరు పేజీల లేఖ రాశారు సీఎం జగన్. మహిళలు, పిల్లల పై లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో వీరి భద్రత కోసం దిశ చట్టం తీసుకుని వచ్చామని లేఖలో పేర్కొన్నారు.
read also : జల వివాదంపై మేం సంయమనంతో ఉన్నాం : సజ్జల
ఏపీ దిశా బిల్లు-2020, ఏపీ దిశా క్రిమినల్ లా బిల్లు-2019 పై అభిప్రాయాలు ఇవ్వాల్సింది కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ను కోరిన కేంద్ర హోంశాఖ… ఈ నేపథ్యంలో సీఎం లేఖకు ప్రాధాన్యత ఏర్పడింది. అవసరమైతే అధికారులు స్వయంగా వచ్చి బిల్లులోని అంశాలు వివరిస్తారని స్పష్టం చేశారు సీఎం జగన్.