ఇండియా కరోనా కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. నిన్న కరోనా కేసులు భారీగా తగ్గగా… ఇవాళ మాత్రం ఆ సంఖ్య మరోసారి పెరిగిపోయింది. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 41,383 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,57,720 కి చేరింది. read also :భారీ వర్షాలు : నిండు కుండలా మారిన ప్రధాన జలాశయాలు ఇందులో 3,04,29,339 […]
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో… ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ప్రధాన జలాశయాలన్నీ నిండుకుండల్లా మారడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టులోకి లక్షా 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 7టీఎంసీల నీరు నిల్వ ఉంది. 16గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 69వేల […]
తూర్పుగోదావరి జిల్లాలో డెంగ్యూ జరాలు భయపెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అధికారికంగా 36 కేసులు నమోదయ్యాయి. క్షేత్రస్థాయిలో ప్రైవేటు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారితో ఈ సంఖ్యకు ఐదింతలు అధికంగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. రాజమండ్రి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో డెంగ్యూ నిర్ధారణకు ఎలీషా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరంతో బాధపడుతూ వస్తున్న వారందరికీ ఎలీషా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాయిస్… గత ఐదేళ్ల నుంచే తూ.గోదావరి జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. 2017లో […]
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో పాటు రుతుపవనాలు చురుగ్గా సాగుతుండటంతో జోరుగా వానలు పడుతున్నాయి. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణశాఖ. దీని ప్రభావంతో మరో మూడు రోజులు వర్షాలు దంచికొట్టే ఛాన్స్ ఉంది. అలాగే అతిభారీ వర్షాలతో కొన్ని జిల్లాలు అతలాకుతలం అయ్యే అవకాశాలున్నాయని చెప్పింది ఐఎండీ. read also : జులై 13, మంగళవారం దినఫలాలు దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాగాలు సిద్ధంగా […]
తెలంగాణలో పెరిగిన భూముల ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి సబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. కొత్త ధరలు, విధి విధానాలు ఖరారు చేసింది. మొత్తం మూడు స్లాబుల్లో భూములు రేట్లు పెంచింది సర్కార్. తెలంగాణలో పెరిగిన భూముల ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రేట్ల పెంపుపై ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్… వ్యవసాయ భూములపై 50 శాతం పెంచింది. కనిష్ఠ మార్కెట్ విలువ ఎకరాకు 75 వేలుగా నిర్ణయించింది. […]
దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గి రూ.44,900కి చేరింది. read also : […]
మేషం : ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు ప్పవు. ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారితీయొచ్చు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. వృషభం : మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ఊహించని ఖర్చులు వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు అధికారుల నుంచి మెప్పు పొందుతారు. కొబ్బరి, పండ్లు, […]
నటరత్న నందమూరి తారక రామారావు స్ట్రెయిట్ మూవీస్ తోనే కాదు, రీమేక్స్ తోనూ జయకేతనం ఎగురవేశారు. హిందీ రీమేక్స్ లోనూ విజయాల శాతం యన్టీఆర్ కే ఎక్కువ. రామారావు కథానాయకునిగా యస్.డి.లాల్ దర్శకత్వంలో రవిచిత్ర ఫిలిమ్స్ పతాకంపై వై.వి.రావ్ నిర్మించిన నేరం నాది కాదు ఆకలిది చిత్రానికి హిందీలో రాజేశ్ ఖన్నా హీరోగా రూపొందిన రోటీ మాతృక. ఈ చిత్రానికి ముందు రామారావుతో యస్.డి.లాల్ దర్శకత్వంలోనే వై.వి.రావ్ నిర్మించిన నిప్పులాంటి మనిషి కూడా హిందీ జంజీర్ ఆధారంగా […]
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ […]
టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మరోసారి ఈటెల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇళ్ళంతకుంట నాయకుల కోసం 5 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారని..భారీ స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు కెసిఆర్ డబ్బుని నమ్ముకున్నాడని… స్కూల్ ను… బార్ గా మార్చి కమలపూర్ వాళ్ళందరిని ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట తీసుకు పోయి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారని… దళిత బంధు హుజురాబాద్ ఎన్నిక కోసమేనన్నారు. ప్రాణం వుండగానే తనను బొంద బెట్టాలని చూసిన… కెసిఆర్ కి మళ్లీ […]