ఇండియా కరోనా కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. నిన్న కరోనా కేసులు భారీగా తగ్గగా… ఇవాళ మాత్రం ఆ సంఖ్య మరోసారి పెరిగిపోయింది. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 41,383 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,57,720 కి చేరింది.
read also :భారీ వర్షాలు : నిండు కుండలా మారిన ప్రధాన జలాశయాలు
ఇందులో 3,04,29,339 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 4,09,394 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 507 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 4,18,987 మంది మృతిచెందారు. ఇక, గడిచిన 24 గంటల్లో 38,652 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 41,78,51,151 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.