ఇవాళ్టి నుంచి తెలంగాణలో పెరిగిన భూముల రేట్లకు రెక్కలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పెరిగిన భూముల ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి సబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. కొత్త ధరలు, విధి విధానాలు ఖరారు చేసింది. మొత్తం మూడు స్లాబుల్లో భూములు రేట్లు పెంచింది సర్కార్.
తెలంగాణలో పెరిగిన భూముల ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రేట్ల పెంపుపై ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్… వ్యవసాయ భూములపై 50 శాతం పెంచింది. కనిష్ఠ మార్కెట్ విలువ ఎకరాకు 75 వేలుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఆయా ఏరియాల్లో ఉన్న మార్కెట్ విలువలకు అనుగుణంగా 3 స్లాబ్‌లు చేసింది. ఓపెన్ ప్లాట్ల చదరపు గజం కనీస ధర 100 రూపాయల నుంచి 200లకు పెంచిన సర్కార్… 50 శాతం, 40 శాతం, 30 శాతం లెక్కన శ్లాబులుగా చేసింది. అపార్ట్‌మెంట్ల ఫ్లాట్ల చదరపు అడుగు కనీస విలువ 800 నుంచి 1000కి పెంచిన ప్రభుత్వం.. చదరపు అడుగుపై 20 శాతం, 30 శాతం లెక్కన పెంచింది.
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
read also : జులై 13, మంగళవారం దినఫలాలు
ఆదాయ వనరులు పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా భూముల మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2013లో భూముల విలువను సవరించింది… అప్పటి ప్రభుత్వం. అప్పటి నుంచీ ల్యాండ్ వాల్యూస్ రివైజ్ చేయలేదు. ఇప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం రెట్టింపు కావడంతో భూముల విలువ పెంచింది సర్కార్. కేబినెట్ సబ్ కమిటీ సూచనలతో ఈ నిర్ణయం తీసుకుంది.
పెంచిన భూముల ధరలు ఇవాళ్టి నుంచి అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. భూములు, ఆస్తుల విలువ పెంపునకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు అధికారులు. దీంతో రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు గిఫ్ట్ డీడ్, కుటుంబీకుల మధ్య రిజిస్ట్రేషన్లు, ఒప్పందాల రేట్లు కూడా పెరగనున్నాయి.
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!