తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 657 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… మరో ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 704 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,38,030 కు చేరుకోగా.. ఇప్పటి వరకు 6,24,477 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. మృతుల సంఖ్య 3,766కు పెరిగింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 97.87 […]
భారత దేశంలో జర్నలస్టులు ఉద్యమకారులు, హక్కుల కార్యకర్తలు, మేధావులతో పాటు ప్రతిపక్ష నేతలు, స్వంత పార్టీలోనే మంత్రులపైన కూడా నిఘా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయిల్ సృష్టించిన పెగాసస్ పరికరాన్ని ప్రయోగించిందన్న వార్త పార్లమెంటును కుదిపేస్తున్నది.అందులోనూ పార్టమెంటు సమావేశాలకు ముందురోజే వాషింగ్టన్ పోస్ట్ లీమాండేలతో సహా ప్రపంచంలోని అనేక ప్రముఖ పత్రికలలో ఈ వార్త వివరాలతో సహాప్రచురితమైంది.భారతదేశంలో దవైర్‌న్యూస్ దీన్ని ప్రచురించింది.నిరసనలను అణచివేయడంలోనూ ప్రత్యర్థులపై నిఘావేయడంలోనూ నిర్బంధం సాగించడంలోనూ ఇజ్రాయిల్ పేరు మోసింది. ఆ దేశానికి చెందిన […]
సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మలయాళ చిత్రం ‘నిళల్’ ఈ యేడాది ఏప్రిల్ 9న విడుదలైంది. ఆ తర్వాత థియేటర్లు మూతపడటంతో ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. ఈ శుక్రవారం ‘నిళల్’ చిత్రాన్ని ‘నీడ’ పేరుతో అనువదించి, ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. జిల్లా మెజిస్ట్రేట్ గా కుంచకో బోబన్ నటించగా, ఎనిమిదేళ్ళ పిల్లాడి సింగిల్ మదర్ పాత్రను నయనతార పోషించింది. ఆమె పిల్లాడు స్కూల్లో ఖాళీ సమయంలో టీచర్ కు, […]
శాండిల్‌వుడ్ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ’. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ ఎంట్రీ గురించి మేకర్స్ అనౌన్స్ చేశారు. నిర్మాత జాక్ మంజునాథ్ మాట్లాడుతూ ‘‘మా సినిమాలో జాక్వలైన్ ఫెర్నాండెజ్ భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది అభిమానులకు, ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజింగ్‌గా, వారిని థియేటర్స్‌కు రప్పించేలా ఉంటుంది. జాక్వలైన్ చాలా ప్రొఫెషనల్ నటి. కచ్చితమైన సమయానికి షూటింగ్‌కు వచ్చేవారు. ఉదయం 9 గంటలకు సెట్స్‌కు వచ్చి […]
ఓ పక్క గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ మూవీ చేస్తూనే దర్శకుడు మారుతి మరో క్యూట్ స్మాల్ లవ్ స్టోరీని కూడా తెరకెక్కించేశాడు. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతూనే ఉన్నా, మారుతీ మాత్రం ఎప్పుడూ అధికారికంగా తన కొత్త సినిమా గురించి పెదవి విప్పలేదు. అయితే… మంగళవారం ఉదయం మాత్రం చిన్న హింట్ ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా […]
బాలనటిగా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది షాలిని. ఆ తర్వాత హీరోయిన్ గానూ సూపర్ స్టార్ స్టేటస్ అనుభవించింది. అయితే సహనటుడు అజిత్ ను ప్రేమించి పెళ్ళాడి నటనకు దూరమైంది. 2001లో అలా నటనకు దూరమైన శాలిని సినిమాలను వదిలి ఫ్యామిలీకే పరిమితం అయింది. ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత మణిరత్నం ‘పొన్నీయిన్ సెల్వన్’ లో రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. అధికారికంగా ప్రకటించకున్నా… అనధికారికంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం షాలిని ఇందులో అతిథిగా మెరవబోతోందట. ఈ చిత్రంలో జయం రవి, […]
అమెరికా అంటే ఒక్కొక్కరికి ఒక్క అభిప్రాయం. కానీ, సినిమా ప్రియులకి మాత్రం… హాలీవుడ్డే! యూఎస్ అనగానే భారీ బడ్జెట్ తో నిర్మించే హాలీవుడ్ చిత్రాలానే చాలా మంది గుర్తు చేసుకుంటారు. అయితే, ప్రపంచంలోని చాలా చిన్న చిన్న దేశాలు లేదా వెనుకబడిన దేశాల వార్షిక బడ్జెట్ కంటే కూడా కొన్ని హాలీవుడ్ చిత్రాల పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది! అంత భారీగా సినిమాల్ని వాళ్లు ఎలా తీస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? అమెరికాలో ఆర్ట్ ని బిజినెస్ గా, బిజినెస్ […]
2020 మొదట్లో షాకిచ్చిన కరోనా వైరస్ క్రమంగా పక్కకు తప్పుకుంటోందా? చాలా దేశాల్లో అలాంటి స్థితి లేకున్నా అమెరికాలో అంతా నార్మల్ అవుతున్నట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా, ప్రతీ వారం నడిచే వీకెండ్ బాక్సాఫీస్ ఫైట్స్ రాను రాను రక్తి కడుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ నీరసంగా రిలీజైన చిత్రాలు ఇప్పుడు కలెక్షన్లతో కళకళలాడుతున్నాయి. అంతే కాదు, లెటెస్ట్ గా రిలీజైన ‘స్పేస్ జామ్’ మైండ్ జామైపోయేలా వసూళ్లతో ఆశ్చర్యపరిచింది! గత వారం కంటే అంతకు ముందటి వారం […]
కరోనా భయాలు, కోవిడ్ జాగ్రత్తల నడుమ ప్రతిష్ఠాత్మక ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ శనివారం ముగిసింది. నిజానికి 74వ ఎడిషన్ కాన్స్ ఫెస్టివల్ ఎప్పుడో జరగాలి. కానీ, మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. అయితే, వైరస్ భయపెడుతున్నా కాన్స్ వేదిక మీదకి ఎప్పటిలాగే అద్భుతమైన సినిమాలు ప్రదర్శనకొచ్చాయి. ప్రతిష్ఠాత్మక పాల్మ్ డీ ఓర్ అవార్డు అందుకున్న ఉత్తమ చిత్రం సహా టాప్ టెన్ మూవీస్ ఎట్ కాన్స్ ని ఇప్పుడోసారి చూద్దాం… ‘టైటానే’ సినిమా అందరి దృష్టినీ […]
బాలీవుడ్ లో ఇప్పుడు బాగా చర్చ నడుస్తోన్న చిత్రాల్లో ‘పఠాన్, టైగర్ 3’ రెండూ ఉన్నాయి. రెండిట్నీ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రానే నిర్మిస్తున్నాడు. మణిశర్మ దర్శకత్వంలో వస్తోన్న ‘టైగర్ 3’లో సల్మాన్ హీరో కాగా ‘పఠాన్’లో షారుఖ్ ఖాన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఈ రెండు స్పై థ్రిల్లర్స్ ప్రస్తుతం ముంబైలోనే షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. అంతే కాదు, ఒకే స్టూడియోలో సల్మాన్, షారుఖ్ మకాం వేశారు. ‘టైగర్ 3’ […]