మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో.. కారుతో పాటు దగ్దమైన వ్యక్తిని గుర్తించారు పోలీసులు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో… వివరాలు తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే, నోటిలో ఉన్న కృత్రిమ పళ్ల ద్వారా మృతుడు శ్రీనివాస్‌గా గుర్తించారు కుటుంబసభ్యులు. ఐతే…ఎక్కడో చంపేసి కారు డిక్కీలో మృతదేహాన్ని తగలబెట్టినట్లు పోలీసుల తెలిపారు. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఫైనల్… ఇవాళ ప్రకటన ! అటవీ ప్రాంతానికి సమీపంలో రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తులు కారును […]
హుజురాబాద్ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో బీజీగా ఉన్నాయి ప్రధాన పార్టీలు. ఉపఎన్నికకు శ్రేణులను రెడీ చేస్తున్నారు నాయకులు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ నియోజకవర్గంలో ప్రచారం ఊదరగొడుతోంది. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇంచార్జ్‌లను నియమించి గ్రౌండ్ వర్క్ చాలారోజుల కిందటే మొదలుపెట్టేసింది. ఇక ఇది ఇలా ఉండగా..ఇవాళ హుజురాబాద్ ఉప ఎన్నికపై గులాబీ బాస్, సీఎం కేసీఆర్.. పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. అంతేకాదు.. […]
పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మింది ఆ మహిళ. భర్త మరణానంతరం కూడా పూజిస్తూ.. ఆయన సేవకే అంకితమైంది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకిరెడ్డి, పద్మావతికి 21 సంవత్సరాల క్రితం వివాహమైంది. దురదృష్టవశాత్తు నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అంకిరెడ్డి. తన భర్త మరణానంతరం ఆయనకు ఏకంగా గుడి కట్టి.. నిత్యం పూజలు చేస్తుంది అతని భార్య. అంతేకాదు ప్రతి పౌర్ణమి, శని, ఆదివారాలలో పేదలకు అన్నదానం కూడా […]
పబ్‌జీ ప్లేయర్లకు గుడ్‌న్యూస్. పబ్‌జీ కూడా పేరు మార్చుకొని పబ్‌జీ బ్యాటిల్‌గ్రౌండ్స్ పేరుతో మళ్లీ మార్కెట్‌లోకి వచ్చేసింది. అంతే కాదు.. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్‌తో వచ్చేసింది. ఆగస్టు 16 వరకు ఒక వారం పాటు ఉచితంగా పబ్‌జీ గేమ్‌ను కంప్యూటర్లలో ఆడుకోవచ్చు. ఐతే.. ఈ వారం రోజుల వరకు ఫుల్ వర్షన్‌ను ఇవ్వరు. కేవలం స్టీమ్ వర్షన్‌ను మాత్రమే ఇస్తారు. ప్లే ఫర్ ఫ్రీ.. ఫ్రీ ప్లే వీక్ పేరుతో ఈ ఆఫర్‌ను పబ్‌జీ తీసుకొచ్చింది. […]
ఇటీవలే టిటిడి చైర్మన్ పదవి బాధ్యతలను.. వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి జగన్ సర్కార్ అప్పగించిన సంగతి తెలిసిందే. మొన్నటి నామినేటెడ్ పదవుల్లో భాగంగా… వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి దక్కింది. అయితే.. ఈ నేపథ్యంలోనే ఇవాళ టిటిడి చైర్మన్ గా భాధ్యతలు స్వీకరించనున్నారు వైవి సుబ్బారెడ్డి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు టీటీడీ అధికారులు. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో […]
మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో పుత్తడిని కొనుగోలు చేసేవారి సంఖ్య అధికం. కరోనా కారణంగా వివాహాలు పెద్దగా హడావుడి లేకుండా సింపుల్‌గా జరుగుతున్నాయి. భారీగా వివాహాం చేసుకోవాలి అనుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు. కరోనా ప్రభావం బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధర ఇప్పటికే రూ. 47 వేలు దాటింది. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా […]
పైన పటారం.. లోన లోటారం. తెలంగాణ బీజేపీలో ఇదే పరిస్థితి ఉందట. ఉన్న కొద్దిమంది నేతలూ ఒక్కమాట మీద లేరట. ఢిల్లీ నుంచి వచ్చిన నాయకుడొకరు ఆ సమస్యకే మందు పూసి వెళ్లారట. కూర్చోబెట్టి క్లాస్ తీసుకున్నట్టు టాక్. మరి.. ఆయన మాటలు కమలనాథుల చెవికి ఎక్కాయా? పార్టీ నేతల మధ్య ఉన్న ఇబ్బందేంటి? బీజేపీలో ముఖ్యనేతల మధ్య గ్యాప్ ఉందా? శరీరానికి దెబ్బ తగిలితే మందు రాస్తారు. చికిత్స చేస్తారు. అదే మనసుకు గాయమైతే..? కోలుకోవడానికి […]
కాంగ్రెస్ పార్టీలో ఎవరేం చేసినా ఓ లెక్క ఉంటుంది. ఎవరికి తోచిన వ్యూహం వాళ్లు అమలు చేస్తారు. తాజాగా పని విభజనపై రగడ మొదలైంది. ముల్లును ముల్లుతోనే తీయబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఎందుకిలా? కొత్త ఎత్తుగడలు ఏం చెబుతున్నాయి? వర్కింగ్ ప్రెసిడెంట్స్‌కు పని విభజనపై రగడ! తెలంగాణ కాంగ్రెస్‌కు మొత్తం ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్. సామాజిక సమీకరణాలతోపాటు అన్ని గ్రూపులను బుజ్జగించేందుకు.. ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా నియమించారు. సంఖ్య ఎక్కువగా ఉండటంతో అందరికీ పని అప్పగించాలని PCCకి […]
మిషన్ భగీరథ పథకంపై మరోసారి కేంద్రం ప్రశంసలు కురిపించింది. ఛత్తీస్ ఘఢ్ పర్యటనలో ఉన్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. మిషన్ భగీరథ పథకం గురించి ప్రస్తావించారు. దేశంలో వంద శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని..తెలంగాణ రాష్ట్రాన్ని మరోసారి అభినందించారు కేంద్ర మంత్రి. దేశంలో ప్రతి ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని ఇవ్వాలనే లక్ష్యానికి చేరువ అయ్యామని కేంద్ర మంత్రి ప్రకటన చేశారు. దేశంలో ప్రతి ఇంటికీ మంచినీరు అనే […]
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు మూడు చక్రాల వాహనాలు అందించేందుకు ముందుకు వచ్చారు పలువురు ప్రజాప్రతినిధులు. ఈ నేపథ్యంలోనే నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్రిచక్ర వాహనాలను అందజేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్నప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తామని.. అనవసర ఖర్చు కూడా చేయాల్సి వస్తుందని చెప్పారు. బ్యానర్లు, హోర్డింగ్స్ పెట్టి వృధా ఖర్చు చేస్తాం. దాన్ని […]