కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. రేవంత్ రెడ్డి ఎన్టీవీకి ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ఇవాళ రాత్రి 7:30 కి ప్రచారం కానుంది.
ప్రగతి భవన్ లో ఈరోజు ఇరిగేషన్ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ లోని అంశాలపై చర్చించనున్నారు. ఇక ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు తెలంగాణ లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయింపులకు మించి నీటిని వాడుకుంటుందని తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. తెలంగాణాలో జల విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి కొరత ఏర్పడుతోందన్న టీ సర్కార్…అధిక నీటిని వాడుతున్న ఏపీని నిలువరించాలంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు […]
ఒలింపిక్స్‌లో పసిడి పతకం కోసం ఏళ్ల నుంచి పడిగాపులు..! బంగారు పతకం దాహం తీర్చే ఆటగాడి కోసం ఆశగా ఎదురు చూస్తోన్న సమయంలో ఒక్కడొచ్చాడు..! తాను విసిరే జావెలిన్‌లా దూసుకొచ్చాడు…! ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి.. మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించాడు..! నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు..! క్రికెట్ తప్ప.. మరో ఆట గురించి పెద్దగా తెలియని.. అసలు పట్టించుకోని మన దేశంలో.. అద్భుతం చేసి చూపించాడు నీరజ్ చోప్రా. భారత బంగారు పతకం ఆశలను నెరవేర్చాడు. టోక్యో […]
అమెరికాలో రోజుకి సగటున నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరింది. 70 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కేసుల ఉద్ధృతి కలవరపెడుతోంది. ఇది దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. జూన్ చివర్లో అమెరికాలో రోజుకి సగటున 11 వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య లక్ష దాటింది. అమెరికాలో గత నవంబర్‌లో రోజువారీ సగటు కేసులు లక్ష నమోదయ్యాయి. అప్పట్లో ఆ సంఖ్యను చేరడానికి ఆరు నెలలు […]
పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన రాజ్ కుంద్రా.. బెయిల్‌పై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పటికి మూడు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించి కుంద్రా విఫలమయ్యారు. తాజాగా బాంబే హైకోర్టు బెయిల్ నిరాకరించింది. రాజ్ కుంద్రా బాలీవుడ్ లోని మోడల్స్ తో పోర్న్ కంటెంట్ వీడియోలను తీసి యాప్ లలో అప్ లోడ్ చేస్తున్నట్టు పక్కా ఆధారాలతో గుర్తించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేశారు. రోజుకో కొత్త విషయాలు ఈ కేసులో వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. […]
గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన సీతానగరం గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. జూన్ 19 రాత్రి సీతానగరం పుష్కరఘాట్‌లో ఉన్న ప్రేమికులపై దాడి చేసి యువతిపై అత్యాచారం చేశారు తాడేపల్లికి చెందిన శేరు కృష్ణకిషోర్, వెంకట్. దాదాపు 50 రోజుల తర్వాత నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి ఆచూకీ కోసం మొత్తం 14 టీంలు రాత్రింబవళ్లు శ్రమించాయి. యువతి గ్యాంగ్ రేప్‌కు ముందు నిందితులు ఓ […]
టోక్యో ఒలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. కొవిడ్ నిబంధనలు కారణంగా ఒలింపిక్స్ ముగింపు వేడుకలను గతంలో మాదిరిగా అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగానే నిర్వహించనున్నారు. జపాన్ జాతీయ స్టేడియంలో జరగనున్న ముగింపు వేడుకలు సాయంత్రం నాలుగున్నరకు ప్రారంభమవనున్నాయి. బాణాసంచా వెలుగు జిలుగులు, జపాన్ పాప్ సంగీతం కనువిందు చేయనుంది. ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్‌తో పాటు మరికొంత మంది ప్రముఖులు ముగింపు వేడుకల్లో ప్రసంగించనున్నారు. ప్యారీస్‌లో జరగబోయే 2024 ఒలింపిక్స్ గురించి ఒక పది నిమిషాల వీడియోను ప్రదర్శించనున్నారు. చివర్లో […]
నాటింగ్‌హమ్ టెస్ట్.. చివరి రోజు కీలకంగా మారింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. గెలవాంటే ఇంకా 157 పరుగులు చేయాలి..! అటు ఇంగ్లండ్ గెలవాలంటే మరో 9 వికెట్లు తీయాలి..! దీంతో గెలుపు కోసం రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అంతకుముందు ఇంగ్లండ్ టీమ్ 303 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ […]
త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్‌పై హత్యాయత్నం జరిగింది. ఆయనను కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించగా.. సీఎం అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విప్లవ్ దేవ్ గురువారం సాయంత్రం వాకింగ్ చేసేందుకు బయటకు వచ్చారు. తన అధికారిక నివాసానికి సమీపంలో సీఎం వాకింగ్ చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు కారు నడుపుకొంటూ భద్రతా వలయంలోకి దూసుకొచ్చారు. వాహనాన్ని గమనించిన ముఖ్యమంత్రి.. వెంటనే పక్కకు జరగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో […]
మీరాభాయ్ చాను నుంచి నీరజ్ చోప్రా వరకు…! టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. పతకాల పట్టికలోనూ మెరుగైన స్థానం దక్కించుకుంది. మెడల్స్ లెక్కల్లోనూ కొత్త మార్క్‌ను సెట్ చేసింది. ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో భారత్ ఆరు పతకాలు గెలవడమే రికార్డుగా ఉండేది…?! కానీ ఆ రికార్డు ఇప్పుడు చెరిగిపోయింది..! టోక్యో వేదిక నుంచి మన క్రీడాకారులు భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండబోతుందన్న ఆశలు రేపారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ .. గతంలో ఎన్నడూ లేనంత […]