అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమంతో పాటు తెలంగాణ స్వయం పాలనలో యువత పాత్ర గొప్పదని సీఎం అన్నారు. తెలంగాణ ఏర్పాటుతో రాజకీయ, పాలనా రంగాల్లో విద్యార్థి యువనేతలకు చట్టసభల్లో పెద్దఎత్తున అవకాశాలు కల్పించి బడుగు బలహీన వర్గాల యువతను ప్రోత్సహిస్తున్నామని సీఎం అన్నారు. ఈ ప్రక్రియ మునుముందు కూడా కొనసాగుతుందని తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని వారి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడే […]
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష కార్యక్రమంపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జూన్ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తికావాలని ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునే విధానంలో ముందుకు సాగాలని… అవసరమైన పరికరాలు, వనరులను సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. అవసరమైన మేరకు డ్రోన్లు కొనుగోలు చేయాలని… అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను తీసుకోవాలని తెలిపారు. సమగ్ర భూ సర్వే ప్రక్రియలో ఎక్కడా కూడా అవినీతికి తావు ఉండకూడదని…ప్రతి నాలుగు వారాలకు […]
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కు ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. నిన్న హరీష్ రావు చేసిన విమర్శలపై అబిడ్స్ లో చర్చకు సిద్దమని..ఎవరిది తప్పు ఐతే వారికి శిక్ష పడుతుందని చురకలు అంటించారు. నా ఆస్తులపై విచారణకు రెడీ అని… సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐ తో విచారణ చేద్దామని సవాల్ విసిరారు. పార్టీలో చేరినపుడు ఇప్పుడు ఉన్న ఆస్తులు లెక్క తెలుద్దామని.. మీ ఆస్తులపై విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. తాను అభివృద్ది […]
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్టుల టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ తుది రిపోర్టులు కేంద్రం నుంచి అందాయి. మొత్తం ఆరింటిలో మూడు మాత్రమే పూర్తిస్థాయి ఎయిర్ పోర్టుల నిర్మాణం, పెద్ద విమానాల రాకపోకలకు అనుకూలమని, మరో మూడు అందుకు అనుకూలంగా లేవని ఎయిర్ పోర్టుల అథారిటీ తేల్చింది. తెలంగాణాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎయిర్ పోర్టుల ఏర్పాటు, విమాన రాకపోకల సాధ్యాసాధ్యాలు, వాటివల్ల కలిగే లాభనష్టాలను భారత విమానయాన సంస్థ బేరీజు వేసింది. మొత్తం ఆరింటిలో […]
రియల్టర్ హత్య కేసులో నిందితుడైన నెల్లూరు బాబా లోక్నాథ్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు బాబా అలియాస్ గురూజీ అలియాస్ త్రిలోక్ నాది సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాబా తో పాటు మరోకరని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన రియల్టర్ విజయ భాస్కర్ రెడ్డి హత్య కేసులో నెల్లూరు బాబా కీలక సూత్రధారి.. తన శిష్యబృందంతో కలిసి కిడ్నాప్ చేసి హత్య చేసిన సంఘటన లో బాబా […]
రైతు బంధుతో కేసీఆర్ దేశానికి ఆదర్శంగా, దిక్సూచిలా నిలిచారని ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 36 ఏళ్లుగా దేశంలోని సమస్యల మీద కవులు, కళాకారులు, మీడియా స్పందించినట్లు మాదిరిగా సినిమా మాద్యమం ద్వారా తాను స్పందిస్తున్నానని తెలిపారు. అర్ధరాత్రి స్వతంత్రం నుండి అన్నదాత సుఖీభవ వరకు 36 సినిమాలు తీశానని..ఈ నెల 14న 37వ సినిమా “రైతన్న” విడుదలవుతుంది.. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టాలు, […]
ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గా ఎన్నికైనా నోముల భగత్.. ఇవాళ స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డు ఈ సందర్భంగా నోముల భగత్ కు అందించారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి,ఆబ్కారీ శాఖ […]
వరుణుడి కారణంగా తొలి టెస్ట్‌లో గెలిచే అవకాశాన్ని కోల్పోయిన టీమిండియా.. సిరీస్‌లో బోణీ చేయాలన్న పట్టుదలతో ఉంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో గురువారం నుంచి జరిగే రెండో టెస్ట్‌లో భారత్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్ట్ ఆఖరి రోజు వర్షం కారణంగా ఆట సాధ్యం కాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియాదే పైచేయిగా కనిపించినా.. టాపార్డర్ వైఫల్యం కలవరపాటుకు గురి చేస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు చటేశ్వర్ […]
అక్కడి అధికారపార్టీలో ముసలం పుట్టింది. ఇద్దరు కీలక ప్రజాప్రతినిధుల ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. నియోజకవర్గంలో పట్టుకోసం ఒకరు.. పట్టుసడలకుండా మరొకరు రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. వారెవరో.. ఏం చేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం టికెట్ కోసం ఇప్పటి నుంచే ఎత్తుగడలు! గద్వాల. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నడిగడ్డగా పిలవబడే ప్రాంతం. అక్కడి రాజకీయం ఓ పట్టాన అంతుబట్టదు. రాష్ట్ర రాజకీయం అంతా ఒకలా ఉంటే గద్వాల పాలిటిక్స్ మరోలా ఉంటాయి. ఏదో ఒక రాజకీయ రగడ కామన్. […]