ఆయన ఆ పార్టీకి అధ్యక్షుడై ఏడాదే అయ్యింది. అప్పుడే ఆయన వెనక గోతులు తవ్వుతున్నారా? ఆ గోతుల వెనక ఒకనాటి మిత్రపక్షం ఉందని అనుమానిస్తున్నారా? పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి? ఏంటా పార్టీ? ఎవరా నాయకుడు? సోమును తొలగించి కన్నాకు పగ్గాలు ఇస్తారని ప్రచారం! సోము వీర్రాజు. ఏపీ బీజేపీకి అధ్యక్షుడై ఏడాది అయ్యింది. ఈ సంవత్సర కాలంలో ఆలయాలపై దాడులు.. అంతర్వేది, దుర్గగుడి రథాలపై ఉద్యమాలు చేశారు. మధ్యలో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికనూ ఎదుర్కొన్నారు. కోవిడ్ వల్ల […]
ఆయన ఎమ్మెల్సీ అయ్యారా.. లేదా? టీఆర్‌ఎస్‌తోపాటు రాజకీయావర్గాల్లో ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. ఆయన్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నా.. ఇంత వరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో ఆ ఫైల్ ఆగిందా లేక ఆపారా అన్న చర్చ జోరందుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్! ఆగస్టు ఒకటో తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి కొద్దిరోజుల ముందే టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ […]
వ్యాక్సిన్‌తోపాటు ఖరీదైన గిఫ్ట్‌లూ ఫ్రీగా ఇస్తామంటూ వాషింగ్టన్‌లో అధికారులు ప్రకటించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉన్న టీనేజర్లను వ్యాక్సిన్‌లు వేసుకునేలా ఎంకరేజ్ చేయడానికి అక్కడి అధికారులు తిప్పలు పడుతున్నారు. ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ను ఫ్రీగా ఇవ్వడంతోపాటు అదృష్టం కలిసొస్తే 25 వేల డాలర్ల స్కాలర్‌షిప్ లేదా ఐప్యాడ్ కూడా దక్కుతుందని… వాషింగ్టన్ డీసీ మేయర్ మురియల్ బౌజర్ ప్రకటించారు. వాషింగ్టన్ డీసీతోపాటు చుట్టుపక్కల ఉన్న టీనేజర్లకు తొలి డోసు తీసుకుంటే ఎయిర్‌పాడ్స్, గిఫ్ట్‌కార్డులు, స్కాలర్‌షిప్పులు ఫ్రీ […]
హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని టీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించేసింది. ఈ మేరకు టిఆర్ఎస్వీ ప్రస్థుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థిగా ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ అధికారికంగా ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో దీక్షతో పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టిఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో […]
నైరుతీ గాలుల ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాగల 24 గంటల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు,మెరుపులతో కూడి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. రాబోయే 24 గంటల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. అతి తేలికపాటి నుంచి తేలికపాటి […]
దేశంలో కరోనా కేసులు మళ్లీ భయపెడుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉంది. ఈతరుణంలో టీకా కొరతను అధిగమించడానికి మిశ్రమ మోతాదులపై ఫోకస్ పెట్టాయి కంపెనీలు, అధ్యయన సంస్ధలు. ఈ క్రమంలోనే కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై అధ్యయనానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. దీంతో తమిళనాడులోని వెల్లూర్ మెడికల్ కాలేజీ ట్రయల్స్ నిర్వహించనుంది. జులై-29న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కి చెందిన నిపుణుల కమిటీ ఈ అధ్యయానికి సిఫారసు చేసింది. కరోనా వ్యాక్సిన్లు అయిన.. కోవాగ్జిన్, […]
భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేష్ పోగాట్‌కు భారీ షాక్ తగిలింది. భారత రెజ్లింగ్ సమాఖ్య ఆమెపై తాత్కాలిక నిషేధం విధించింది. టోక్యో ఒలింపిక్స్ శిబిరంలో అమర్యాదగా ప్రవర్తించినందుకు డబ్ల్యూఎఫ్ ఈ చర్యలు తీసుకుంది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఆగస్టు 16 వరకు వినేశ్ ఫొగాట్‌కు గడువు ఇచ్చింది. అనుచిత ప్రవర్తనకు గానూ మరో యువ రెజ్లర్ సోనమ్‌కు కూడా డబ్ల్యూఎఫ్ఐ నోటీసులు జారీ చేసింది. టోక్యో ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో కచ్చితంగా పతకం తీసుకొస్తుందని భావించినప్పటికి పేలవమైన […]
హుజూరాబాద్ లో ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల సందడి నెలకొంది.. ఓవైపు అధికార టి ఆర్ యస్ పార్టీ ఒకడుగు ముందుకేసి నియోజకవర్గ వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో క్యాడర్ దించి హడావుడి చేస్తోంది. ఇప్పుడు మంత్రి హరీష్ రావు కూడా పూర్తిస్థాయిలో నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పార్టీ నేతలతో సమావేశమై హుజురాబాద్ ఎన్నికపై చర్చించనున్నారు. తమ పార్టీ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రకటించే అవకాశం […]
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంపీ సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. సతీసమేతంగా తిరుమల చేరుకున్న ఆయన బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు సంతోష్ కుమార్ దంపతులకు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి వారికి స్వామివారి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. నేడు ఎంపీ సంతోస్ కుమార్ వివాహ వార్షికోత్సం కావడంతో స్వామివారిని దర్శించుకున్నారు.
ఓబీసీలను గుర్తించే హక్కు తిరిగి రాష్ట్రాలకే కట్టబెడుతూ కేంద్రం ప్రతిపాదించిన రాజ్యాంగ చట్టసవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. గతంలోనే ఈ బిల్లుకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. 127వ రాజ్యాంగ సవరణ బిల్లు-2021ను లోక్‌సభలో ప్రవేశ పెట్టారు సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్రకుమార్. 671 కులాలకు ప్రయోజనం చేకూర్చే చరిత్రాత్మక చట్టంగా అభివర్ణించారు. రాష్ట్రాలు తమ పరిధిలోని ఓబీసీ కులాలను గుర్తించే హక్కును పునరుద్ధరించటం ద్వారా ఎన్నో కులాలకు సామాజిక, ఆర్థిక న్యాయం కలిగించవచ్చన్నారు. […]