దేశంలో కరోనా కేసులు మళ్లీ భయపెడుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉంది. ఈతరుణంలో టీకా కొరతను అధిగమించడానికి మిశ్రమ మోతాదులపై ఫోకస్ పెట్టాయి కంపెనీలు, అధ్యయన సంస్ధలు. ఈ క్రమంలోనే కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై అధ్యయనానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. దీంతో తమిళనాడులోని వెల్లూర్ మెడికల్ కాలేజీ ట్రయల్స్ నిర్వహించనుంది. జులై-29న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కి చెందిన నిపుణుల కమిటీ ఈ అధ్యయానికి సిఫారసు చేసింది. కరోనా వ్యాక్సిన్లు అయిన.. కోవాగ్జిన్, కోవిషీల్డ్ మిక్సింగ్ కోసం 300 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై… ఫేజ్-4 క్లినికల్ ట్రయల్ నిర్వహించేందుకు వెల్లూర్ మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.
స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై సస్పెన్షన్
ఇప్పటికే దేశంలో కరోనా వ్యాక్సిన్ మిక్సింగ్‌పై మొదటి అధ్యయనం ఫలితాలను ఐసీఎంఆర్ విడుదల చేసింది. కోవాక్సిన్, కోవిషీల్డ్ మిశ్రమ మోతాదు కరోనా వైరస్ నుంచి మెరుగైన రక్షణను అందిస్తుందని అధ్యయనం చెబుతోంది. కరోనా వ్యాక్సిన్ మిక్సింగ్‌పై ఐసీఎంఆర్ మే-జూన్ మధ్యలో యూపీలో ఈ అధ్యయనం చేసింది. టీకా మిక్సింగ్ అధ్యయనం 3 గ్రూపులుగా విభజించి జరిపారు. ఒక్కో గ్రూపులో 40 మందిని చేర్చారు. టీకాలు వేసిన తరువాత, అన్ని సమూహాలలోని వ్యక్తుల భద్రత, రోగనిరోధక శక్తి ప్రొఫైల్స్ ను పోల్చిచూశారు. ఒకే టీకా 2 డోసులు తీసుకున్న వారి కంటే రెండు టీకాల మిశ్రమ మోతాదులను తీసుకున్న వ్యక్తులలో ఎక్కువ యాంటీబాడీస్ ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది.