తిరుపతి : ప్రస్తుతం జన ఆశీర్వాద యాత్రలో బిజీగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల జలవివాదం పై సామరస్యంగా పరిష్కరిస్తామని… అభివృద్ధి కోసం రెండు రాష్ట్రాలు సహకరించుకోవాలని కోరారు. రెండు రాష్ట్ర సమస్యల పరిష్కారానికి జగన్, కేసిఆర్ లతో మాట్లాడుతానని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా టూరిజం రంగం తీవ్రంగా నష్టపోయిందని..టూరిజం రంగానికి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటిస్తామని తెలిపారు.టూరిజం రంగాన్ని వేగంగా అభివృద్ధి చేస్తామని.. దేఖో అప్ కా […]
రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా యూపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు ఏ బస్సులోనైనా, ఎప్పుడైనా ఉచితంగా ప్రయాణించేలా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. 21 ఆగస్ట్ అర్ధరాత్రి నుంచి 22 ఆగస్ట్ అర్ధరాత్రి 12 గంటల వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ఉత్తర్వుల్లో తెలిపింది. మహిళలు అన్ని రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని UPSRTC పేర్కొంది. పింక్ టాయిలెట్ల నిర్మాణంతోపాటు రాష్ట్రంలోని […]
హైదరాబాద్ : సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కేసు ను చేధించారు పోలీసులు. ఈ రేప్ కేసులో యువతి ఆడిన నాటకాన్ని బట్టబయలు చేశారు పోలీసులు. తనను ముగ్గురు ఆటో డ్రైవర్ లు ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారని నిన్న సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో యువతి ఫిర్యాదు చేయగా… ప్రత్యేక దర్యాప్తు టీమ్ లు ఏర్పాటు చేసి.. దర్యాప్తు నిర్వహించారు. యువతి చెప్పిన సమయానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు పోలీసులు. అయితే..సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా […]
ఇండియా లో “కరోనా” వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. దేశంలో గడచిన 24 గంటలలో 36,401 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు కాగా…530 మంది మృతి చెందారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 39,157 కాగా…దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 3.23 కోట్ల కు చేరింది. ఇటు దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 3,64,129 కు చేరగా…దేశ వ్యాప్తంగా “కరోనా” పూర్తిగా కోలుకున్న వారి […]
తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు పూనుకుంటోంది. వ్యాక్సిన్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని ప్రకటించిన రాష్ట్ర వైద్యశాఖ.. థర్డ్ వేవ్ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. అంతేకాదు 18ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తోంది. లేకపోతే పబ్లిక్ ప్లేస్ లలో తిరిగేందుకు అనుమతి ఉండకపోచ్చంటోంది. తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుండటంతో.. కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం […]
కొవిడ్ దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన అమెరికా… వైరస్ విజృంభణతో మరోసారి విలవిల్లాడుతోంది. ఆస్పత్రుల్లో చేరుతున్న వైరస్ బాధితుల సంఖ్య మళ్లీ ఎక్కువ అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత రెండు వారాల్లోనే ఆస్పత్రుల్లో చేరిన కరోనా రోగుల సంఖ్య ఏకంగా 70 శాతానికి పైగా పెరిగింది. మరణాలు కూడా క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కరోజు వ్యవధిలో కరోనాతో చనిపోయిన అమెరికన్ల సంఖ్య వెయ్యి దాటింది. గంటకు 42 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు తేల్చారు. వ్యాక్సినేషన్ […]
గాంధీ ఆస్పత్రిలో జరిగినఅత్యాచార ఘటనలో కొత్త ట్విస్టు వెలుగు చూసింది. మెడికల్ రిపోర్ట్ నమూనా పరీక్షల్లో… మత్తుమందు ప్రయోగం ఆనవాళ్లు కనిపించలేదు. ఇప్పుడీ మెడికల్ రిపోర్టే ఈ కేసులో.. కీలకంగా మారింది. తమకు నిందితులు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది బాధితురాలు. దీంతో బాధితురాలి నుంచి రక్తంతో సహా వివిధ నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించింది ఫొరెన్సిక్ బృందం. వీటిలో క్లోరోఫామ్ సహా ఇతర మత్తు పదార్థాలేవీ కనిపించలేదని.. నివేదిక ఇచ్చింది.ఇప్పటికే […]
అఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు చాలా దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. అయితే.. అఫ్ఘనిస్థాన్ సంక్షోభంపై ఇప్పటికే చాలా మంది స్పందించారు. ఇటు MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ..కూడా స్పందించి… తాలిబన్లతో భారత్ చర్చలు జరపాలని రెండు రోజుల క్రితం ట్వీట్ చేశాడు. అయితే.. దీనిపై బీజేపీ నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. భారత్‌లోని ఆఫ్ఘన్ రాయబారి స్వయంగా తాలిబన్లను వ్యతిరేకిస్తూ, ఆ దేశంలో ఇంకా పోరాడుతున్న ఆఫ్ఘనిస్థాన్ ఉపాధ్యక్షుడిని సమర్థించినప్పుడు, తాలిబన్లలతో భారత్ చర్చలు జరపాలని చెప్పడంలో […]
తెలంగాణలో పల్లెలు మంచం పట్టాయి. విషజ్వరాలు ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. వారం రోజుల నుంచి వాతావరణంలో మార్పులు.. దాంతో వైరల్ పీవర్ బారిన జనం పెద్ద ఎత్తున పడ్తున్నారు. దోమల బెడద కూడా తోడవడటంతో డెంగీ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో అధికంగా డెంగ్యూ కేసులు నమోదవతున్నాయి. హైదరాబాద్‌లో 447, ఖమ్మం లో 134 కేసులు, రంగారెడ్డి లో 110 కేసులు మొత్తానికి ఈ ఏడాది ఇప్పటికే 12 వందల […]