శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ్ జీయర్ స్వామి ముఖ్య అతిథిగా స్వస్తిశ్రీ ప్లవ నామ సంవత్సర శ్రావణ శుక్ల చతుర్దశి తేదీన అనగా 21-08-2021 శనివారం నాడు ఉదయం 7 గంటలకు ”శ్రీ శ్రీనివాస కళ్యాణం” ను ”ది చెన్నై సిల్క్స్ మరియు శ్రీ కుమరన్ గోల్డ్ & డైమెండ్స్” వారు నిర్వహిస్తున్నారు. ఈ వివాహ మహోత్సవం కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ”ది చెన్నై సిల్క్స్” భవనం 4 వ అంతస్థులో నిర్వహించబడును. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి శిష్య బృందం చే ఈ వివాహం జరగనుంది. ఈ శ్రీ శ్రీనివాస కళ్యాణంకు అందు ఆహ్వానితులే… కావున తామెల్లరు విచ్చేసి స్వామి వారి తీర్ధప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని మనవి. ఫ్రీ బుకింగ్ అలాగే మరిన్ని వివరాలకు 7995474442 నెంబర్ ను సంప్రదించగలరు.
ఈ కార్యక్రమం పూర్తి వివరాలు :
ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య వేధ పారాయణం జరుగుతుంది.
ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య శ్రీ శ్రీనివాస కళ్యాణం విశ్వక్ సేన ఆరాధన, పుణ్య వచనం, రక్ష బంధనం, యజ్ఞోపవిత ధరణ జరుగుతుంది.
ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాధ జియ్యర్ స్వామి ప్రవచనాలు, శ్రీ వారి కళ్యాదానం, మంగళాష్టకాలు, మహా సంకల్పం, చూర్ణిక, మంగళ సూత్ర ధారణచ, బ్రహ్మ ముడి, నివేధనం, హారతి కార్యక్రమాలు జరుగుతాయి.
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు.