గుంటూరు : తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు దేవాదాయశాఖ నోటీసులు జారీ చేసింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టు స్వభావం తెలపాలంటూ నోటీసులో పేర్కొంది దేవాదాయ శాఖ. ట్రస్టు వార్షిక ఆదాయం, వివరాలు సమర్పించాలని నోటీసులో తెలిపింది దేవాదాయశాఖ. ట్రస్టు డీడ్ , మేనేజింగ్ ట్రస్టీ, ట్రస్టు ఆస్తులు, ఇతర ట్రస్టుల వివరాలకు సంబంధించిన కాపీలు అందించాలని దేవాదాయ శాఖ పేర్కొన్నారు. FDRలు, ట్రస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ వివరాలు, గత […]
అండమాన్ దీవుల్లో గురువారం అర్థరాత్రి దాటిన అనంతరం భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో రాత్రి 1.37 గంటల సమయంలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. నికోబార్ దీవిలోని క్యాంప్ బెలే బే నుంచి 640 కి మీ దూరంలో.. భూమికి పది కిమీ లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఎస్‌సీఎస్ పేర్కొంది. గురువారం ఉదయం నాలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది. జమ్మూ కాశ్మీర్ లోని కత్రా, యూపీలోని […]
మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 44,100 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర […]
ఐపీఎల్ రెండో దశ సమీపిస్తుండటంతో సందడి పెరుగుతోంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ యూఏఈకి చేరుకున్నాయి. ఐపీఎల్ కోసం అందరికన్నా ముందుగా దుబాయ్‌లో అడుగుపెట్టింది డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్. ఆరు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకొని సాధన కూడా మొదలు పెట్టేసింది. రెండోదశలో తన తొలిమ్యాచులో రోహిత్‌సేన చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. మూడు రోజుల క్రితమే యూఏఈ చేరుకున్న ధోనీసేన ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 21న, సన్‌రైజర్స్ హైదరాబాద్ 31న అక్కడికి […]
కొత్తగా వచ్చిన పథకాలు చేతినిండా వారికి పని కల్పిస్తున్నాయి. కానీ.. వైరిపక్షం చేసే విమర్శలకే కౌంటర్లు ఇవ్వడం లేదట. కొందరే స్పందిస్తున్నారట. మిగతా వారి సంగతేంటో తెలియడం లేదు. వాళ్లది మౌనమా.. వ్యూహమా కూడా అర్థం కావడం లేదట. టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం ఈ చర్చే సాగుతోంది. ప్రవీణ్‌కుమార్ విమర్శలకు కొందరే కౌంటర్ ఇచ్చారా? తెలంగాణలో కొత్తగా రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ పొలిటికల్ కలర్స్ మారుతున్నాయి. మాజీ ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ […]
పీసీసీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టాక దూకుడు పెంచారు రేవంత్. ఈ సమయంలో ఆయనకు అసమ్మతి దెబ్బలు గట్టిగానే తగుతున్నాయట. సీనియర్ల సహాయ నిరాకరణతో సభా వేదికలను మార్చుకోక తప్పడం లేదు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో ఇదే హాట్ టాపిక్. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. రేవంత్‌కు అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోందా? తెలంగాణ కాంగ్రెస్‌లో ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్కఅన్నట్టుగా వెళ్తున్నారు పీసీసీ చీఫ్. ఈ క్రమంలోనే పార్టీలో సభలు.. సమావేశాల ప్రకటనలపై వివాదాలు […]
బండి సంజయ్ బండరాం బయటపెడుతానని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సవాల్ విసిరారు. బండి సంజయ్ మీద కరీంనగర్ నుండి మాకు వందలాది కాల్స్ వస్తున్నాయని… బండి సంజయ్ ని ఎంపీ పదవి నుండి దింపే వరకు ఊరుకోనని హెచ్చరించారు.. పూర్తి ఆధారాలతో బండి సంజయ్ పై మీడియా సమావేశం పెడుతానని… తాను భయపడే వ్యక్తి ని కాదు…బయపడితే రాజకీయాల్లో ఉండలేనన్నారు. దళితుల పై దాడి చేశానని అంటున్నారు… తాను ఎక్కడా లేను సిసి టీవీ ఫుటేజ్ […]