రాష్ట్ర రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు చురుకుగా ఉన్న ఆ ఎమ్మెల్యే.. సడెన్‌గా చంటిగాడు లోకల్ అయిపోయారు. కాంగ్రెస్ పెద్ద బాధ్యత అప్పగించినా ఉన్నట్టుండి సైలెంట్. ఆయనకేమైందో అంతుచిక్కడం లేదు. ఇదంతా వ్యూహమా.. కొత్త ఎత్తుగడా? ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్! లోకల్ పాలిటిక్స్‌కే పరిమితం అవుతారట! తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్. కాంగ్రెస్‌లో ట్విస్ట్‌లు కొత్తేం కాకపోయినా.. ఎప్పటికప్పుడు సరికొత్తగా ఉంటుంది నేతల తీరు. ఆ విధంగా లేటెస్ట్‌గా చర్చల్లోకి వచ్చారు టీపీసీసీ వర్కింగ్ […]
ఆడవారి మాటలకు అర్థాలే వేరన్నట్టు.. రాజకీయ నేతల మాటలకు అర్ధాలు వేరు. స్టేట్‌మెంట్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. మంత్రి మల్లారెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ మధ్య సవాళ్లూ ఆ కోవలోకే చేరతాయా? రాజీనామాలపై వారి ప్రకటనలు నమ్మొచ్చా.. లేక రాజీడ్రామాలా? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ట్రెండింగ్ సీన్ ఇదే. అసలే మంత్రి మల్లారెడ్డి. పక్కా నాటు. ఆయన్ని కెలికారు పీసీసీ చీఫ్ రేవంత్. ఇంకేముందీ మీడియా ముందుకు వచ్చి తొడలు కొట్టారు.. సవాళ్లు విసిరారు మంత్రిగారు. రాజీనామాలపై […]
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. ప్రతిరోజూ వెయ్యికిపైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,515 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,09,245 కి చేరింది. ఇందులో 19,80,407 మంది కొలుకొని డిశ్చార్జ్ కాగా, 15,050 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 10 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో […]
లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 432 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా భారత జట్టు పై తొలి ఇన్నింగ్స్ లో 354 పరుగుల ఆధిక్యం సంపాదించింది ఇంగ్లండ్ టీం. ఇక మూడో రోజు 8 వికెట్ల నష్టానికి 423 పరుగులకు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్.. మరో 9 పరుగులు జోడించి ఆలౌటైంది. ఇక ఇంగ్లండ్ బ్యాటింగ్ వివరాల్లోకి వెళితే… రూట్ 121 పరుగులు, బర్న్స్ 61 పరుగులు, హసీద్ హమీద్ 68 పరుగులు, […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్ కోస్తా తీరానికి దగ్గరగా వాయువ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 3.1 km ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉన్నది. దీని ప్రభావం వలన రేపు(28.08.2021) ఉదయం నకు వాయువ్య & దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.13°N అక్షాంశము […]
తన చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కరీంనగర్ కలెక్టరేట్ లో దళిత బంధు పై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. రెండున్నర గంటలపాటు దళిత బంధుపై చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణమని, ఎన్నట నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన […]
కేంద్ర ప్రభుత్వనికి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా ట్రైబ్యునల్ లో కేటాయింపులు లేవని.. వరద జలాల ఆధారంగా ఆ ప్రాజెక్టును చేపట్టారని లేఖ లో పేర్కొన్నారు. వెలిగొండకు అనుమతులు లేవన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్ వెలుపలకు నీరు తరలిస్తున్నారని.. ఈ అంశం పై గతంలోనే ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. అనుమతి లేని ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద నిధులివ్వడం పై ఈఎన్‌సీ అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ సర్కార్. ఇది […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో రెండు చోట్ల పోటీ చేసి రెండుచోట్ల ఓడిపోయిన మంచి నాయకుడు అని… పవన్ సినిమాల్లో మంచి డాన్సులు , ఫైట్లు చేస్తాడని ఎద్దేవా చేశారు. వ్యక్తిగతంగా ,సినీహీరోగా పవన్ కళ్యాణ్ అంటే నాకూ అభిమానమేనని… కానీ పవన్ రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. జగన్ తో తనను పవన్ పోల్చుకోకుండా ఉంటే మంచిదని… పార్టీ ఆవిర్భావం […]
కరీంనగర్ కలెక్టరేట్ చేరుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. నిన్న రాత్రి కరీంనగర్ వెళ్లిన సీఎం కేసీఆర్.. అక్కడే బస చేశారు. ఇక ఇవాళ ఉదయం.. కరీంగనర్ జిల్లాలోని ఓ టీఆర్‌ఎస్ నేత కూతురి వివాహానికి హాజరయ్యారు. అక్కడ నూతన వధువరులను ఆశీర్వదించారు సీఎం కేసీఆర్. అనంతరం అక్కడి నుంచి నేరుగా కరీంనగర్ కలెక్టరేట్ చేరుకున్నారు. ఇక కలెక్టరేట్ లో మరికాసేపట్లో దళిత బంధు పథకం పై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. ఇది ఇలా ఉండగా… సీఎం […]
తిరుపతి : చంద్రబాబుకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మరో సవాల్ విసిరారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. సమితి అధ్యక్షుడి నుంచి ఉప ముఖ్యమంత్రి హోదా వరకు నిజాయితీగా పనిచేశానన్న డిప్యూటీ సిఎం.. కృష్టాపురం, ఎన్టీఆర్ జలాశయాలు అభివృద్ధి చేయడానికి సిఎం జగన్ కోరానని తెలిపారు. జలాశయాల అభివృద్ధి సిఎం హామీ ఇచ్చారని… కుప్పం అభివృద్ధి చేస్తున్న ఘనత జగన్ అన్నదేనని వెల్లడించారు. కావాలంటే చంద్రబాబు… కుప్పం వెళ్ళి ప్రజలనే […]