ప్రకాశం : స్కూల్స్ లో విద్యార్దుల హాజరుశాతం గణనీయంగా పెరుగుతుందని.. 74 శాతం విద్యార్థులు స్కూల్స్ కు వస్తున్నారని ఎన్టీవీతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శ్రీకాకుళంలో 83శాతం హాజరుశాతం నమోద అయ్యారని… కొన్ని చోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. స్కూల్స్ లో కరోనా భయంతో తల్లితండ్రులు ఆందోళన చెందుతున్న మాట వాస్తవమేనని… ప్రభుత్వం తల్లిదండ్రుల ఆందోళనను గుర్తించిందని వెల్లడించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా పాఠశాలలు నడపాలన్నదే […]
అనంతపురం కలెక్టర్ కార్యాలయం లో ఘోర ప్రమాదం తప్పి పోయింది. ఆ జిల్లా కలెక్టర్ బంగ్లాలోని ఓ గది పై కప్పు కుప్ప.. ఒక్క సారిగా కూలిపోయింది. ఈ ఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అనంతపురం కలెక్టర్ కార్యాలయం లో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. బ్రిటిష్ కాలం నాటి భవనం కావడంతో.. ఈ మరమ్మత్తు పనులు చేయిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యం లో కలెక్టర్ కార్యాలయం లోని ఓ గది కి చెందిన […]
అధికార టీఆర్‌ఎస్ పార్టీ పై బీజేపీ నేత విజయశాంతి మరో సారి మండి పడ్డారు. ”పీసీసీ అధ్యక్షులు, టీఆరెస్ మంత్రిగారికి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ళ గురించి మల్కాజిగిరి పార్లమెంట్‌తో పాటు మేడ్చల్ అసెంబ్లీ ప్రజలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మాట్లాడిన భాష, పదజాలం ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నదో అన్న చర్చ ఒకటైతే…. ఆ రాజీనామాలు జరిగి ఉపఎన్నికలు వస్తే తమకు ఈ టీఆరెస్ ముఖ్యమంత్రి ఏదో వరాలు అవసరార్థం తప్పనిసరై ఇవ్వచ్చేమో అనే […]
ఇండియాలో కరోనా టెర్రర్ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 44,658 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,26,03,188 కి చేరగా ఇందులో 3,18,21,428 మంది ఇప్పటికే కోలుకున్నారు. 3,44,899 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 496 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 4,36,861 మంది కరోనాతో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో […]
కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు..ఆదే నోరు జారితే? తీసుకోవటం కుదరదు. నరంలేని నాలుక ఏమైనా అంటుంది. ఇప్పుడు కొందరు నేతలకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. ప్రస్తుతం రాజకీయాలంటేనే తిట్ల పురాణంలా మారింది. ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు ..తిట్టు ..ప్రతి తిట్టు. ఇప్పుడు ఇదే ట్రెండ్. నిన్న బండి వర్సెస్ మైనంపల్లి. తాజాగా రేవంత్ వర్సెస్ మల్లారెడ్డి. ఈ రెండు ఎపిసోడ్‌లలో నేతల భాషా ప్రావిణ్యాన్ని చూడోచ్చు. వాటిని ఆరోపణలు ప్రత్యారోపణలు అంటారా…లేదంటే తిట్లు ప్రతి తిట్లని […]
దళిత గిరిజన ఆత్మగౌరవ పేరుతో సభలు.. సమావేశాలు పెట్టి కాంగ్రెస్ దూకుడుగా వెళ్తోంది. ఈ స్పీడ్ పార్టీ వర్గాలకు బలమైన టానిక్‌లా పనిచేస్తుందన్నది నేతల ఆలోచన. కానీ.. ఆ నియోజకవర్గంలో అంతా రివర్స్. కయ్యానికి కాలుదువ్వడమే తప్ప.. కలిసి సాగే పరిస్థితి లేదు. అందుకే వచ్చే ఎన్నికల నాటికి కొత్త నేత తెరపైకి వస్తారని జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ నేత ఎవరు? ఏంటా నియోజకవర్గం? దేవరకద్రలో కాంగ్రెస్ ప్లాన్ బీ అమలు చేస్తుందా? ఉమ్మడి […]
TTD పాలకమండలి సభ్యుల ఎంపిక ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందా? లెక్కకు మిక్కిలిగా సిఫారసులు, ఒత్తిళ్లతో ఎవర్ని ఎంపిక చేయాలో.. ఎవర్ని కాదనాలో తేల్చుకోలేకపోతుందా? మొహమాటానికి పోయి పోయినసారి సభ్యుల సంఖ్య పెంచిన ప్రభుత్వం మరోసారి అదే చేయడానికి వెనకాముందు ఆలోచిస్తోందా? పాలకమండలిలో చోటుకోసం కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్రాల సీఎంల నుంచి వచ్చిన చాంతాడంత జాబితాను కుదించడం.. కాదనడం సర్కార్ వల్ల కావడం లేదట. 1933లో ఏడుగురు సభ్యులతో పాలకమండలి నియామకం! తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న […]
ఐదారేళ్ల గ్యాప్ తర్వాత టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకం దేనికి సంకేతం? జిల్లాల్లో ఎవరికైనా కత్తెర పడబోతుందా? నిన్నమొన్నటి వరకూ తామే సుప్రీం అనుకున్నవారికి చెక్ పడినట్టేనా? గులాబీ పెద్దల ఆలోచనలో వచ్చిన మార్పునకు కారణం ఏంటి? అధికారపార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకానికి నిర్ణయం! టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పార్టీ వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి.పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే దిశగా […]
థర్డ్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి.. కేరళ, కర్నాటక కేంద్రంగా అది విజృంభించనుందా? అంటే అలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. కేరళలో అయితే పరిస్థితి మరీ దారుణం. ఓనమ్ తరువాత పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగాయి. బుధవారం ఒక్క రోజే 31 వేల 445 కేసులు రిజిస్టరయ్యాయి. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఇది 65 శాతం. అలాగే టెస్ట్ పాజిటివ్ రేట్ కూడా అమాంతం పెరిగింది. ప్రస్తుతం అది 19 శాతంగా ఉంది. మే 20 తరువాత కేరలలో […]
కరోనా కారణంగా దాదాపు రెండేళ్లుగా విద్యార్ధుల చదువులు అటకెక్కేశాయి. స్కూళ్లకు తాళాలు పడ్డాయి. పరీక్షల నిర్వహణ కూడా సక్రమంగా జరగలేని పరిస్థితి నెలకొంది. అయితే విద్యార్ధుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలు తెరవాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఇటీవలే స్కూళ్లు కూడా తెరుచుకున్నాయి. మొదట్లో విద్యార్ధుల హాజరు శాతం తక్కువగా ఉన్నా.. క్రమంగా పుంజుకుంది. అలాగే స్కూళ్లలో అన్ని రకాల జాగ్రత్తలు సైతం తీసుకుంటున్నారు. అయినా కొన్ని చోట్ల కరోనా కేసులు బయటపడడం కలకలం రేపింది. విజయనగరం […]