IPL 2026: కోహ్లీ వర్సెస్ రికార్డ్స్.. ఐపీఎల్‌లో నయా చరిత్రకు అడుగు దూరంలో కింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: ఐపీఎల్ అంటేనే రికార్డుల పండగ.. ఆ పండగలో ప్రధాన ఆకర్షణ ఎప్పుడూ విరాట్ కోహ్లీనే.. 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుఫున ఆడుతున్న ఈ స్టార్, ఇప్పుడు మరోసారి విశ్వరూపం చూపేందుకు రెడీ అయ్యాడు. ఐపీఎల్‌లో ఇప్పటికే 8 వేల పరుగుల మార్కును దాటిన ఏకైక బ్యాటర్‌గా ఉన్న విరాట్, 2026 సీజన్‌లో 9 వేల పరుగుల క్లబ్‌లో చేరి తన ఆధిపత్యాన్ని చాటుకోనున్నాడు. గత మూడు సీజన్లలో నిలకడైన ఫామ్‌తో దూసుకుపోతున్న కింగ్, ఈ ఐపీఎల్‌లో నయా చరిత్రను సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు.
Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
9000 పరుగులకు కావాల్సింది ఎన్నంటే..
ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 267 మ్యాచ్‌ల్లో 8,661 పరుగులు ఉన్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో అతను మరో 339 పరుగులు సాధిస్తే, ఈ లీగ్ చరిత్రలో 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు. గత మూడు సీజన్లలో కోహ్లీ ఫామ్ చూస్తుంటే ఈ ఘనత సాధించడం అతనికి నల్లేరు మీద నడకే అనిపిస్తోంది.
2023: 639 పరుగులు (సగటు 53.25)
2024: 741 పరుగులు (సగటు 61.75)
2025: 657 పరుగులు (సగటు 54.75)
రికార్డుల రారాజు..
2008 నుంచి ఆర్‌సిబి జట్టులో ఉన్న కోహ్లీ, ఐపీఎల్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధికంగా 8 సెంచరీలు బాదిన రికార్డు కోహ్లీదే. (రెండో స్థానంలో జోస్ బట్లర్ – 7 సెంచరీలు). అలాగే 8000 మార్కును దాటిన ఏకైక ఆటగాడిగా కూడా రికార్డ్‌ను నెలకొల్పాడు. ఈ మెగా లీగ్‌లో ఇప్పటివరకు 63 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు కింగ్. పరుగుల వేటలో కోహ్లీకి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ జాబితాలో రోహిత్ శర్మ 7,000 పైచిలుకు పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
మార్చి 28న తొలి పోరు.. ఎస్‌ఆర్‌హెచ్‌తో ఢీ!
అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో, అభిమానులు కోహ్లీని కేవలం ఐపీఎల్‌లోనే చూడగలరు. అందుకే 2026 సీజన్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మార్చి 28న జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆర్‌సిబి vs ఎస్‌ఆర్‌హెచ్ (RCB vs SRH) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తోనే కోహ్లీ తన రికార్డుల వేటను ప్రారంభించనున్నాడు.
READ ALSO: Iran Execution: ఇజ్రాయెల్ గూఢచారికి ఇరాన్ గడ్డపై ఉరిశిక్ష
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!