అతంర్యుద్ధంతో అల్లాడుతున్న ఆఫ్గనిస్తాన్‌ని మరో పెను ప్రమాదం వెంటాడుతోంది. అదే ఆకలి సంక్షోభం. లక్షలాది మంది చిన్నారులు ఆకలికి అలమటిస్తున్నారు. ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గోధుమ, బియ్యం, చక్కెర , నూనె ధరలు సామాన్యుడు కొనుక్కునే పరిస్థితిలో లేడు. దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులు…వలసలు..తాజాగా తాలిబాన్ సంక్షోభం. వెరసి ధరలకు రెక్కలొచ్చాయి. కరోనాకు ముందు ధరలతో పోలిస్తే 50 నిత్యావసర సరుకుల ధరలు శాతానికి పైగా పెరిగాయి.స్వచ్చంద సంస్థ సేవ్ ది చిల్డ్రన్ తన […]
సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారా ? లేదా ? అని చార్మినార్ వేదిక నుండి కేసీఆర్ కి సవాల్ విసురుతున్నానని తెలిపారు. బండి సంజయ్ పాదాయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పాత బస్తి కి మెట్రో రైలు రాక పోవడానికి కారణం ఒవైసీ అని… పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండి పడ్డారు. హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు […]
సెప్టెంబర్ 10 న గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇవాళ గణేష్ ఉత్సవాలపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని… కరోనా వల్ల ఇబ్బందులు ఉన్నా, నియమాలు పాటిస్తూ నిర్వహించుకోవాలని తెలిపారు. దేశానికే ఆదర్శంగా హైదరాబాద్ లో వినాయక చవితి పండుగ జరుగనున్నట్లు వెల్లడించారు. అటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి […]
శ్రీకాకుళం : ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లో 155 స్థానాలతో టీడీపీ అధికారంలోకి రావడం తధ్యమని స్పష్టం చేశారు. ఇవాళ పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా టీడీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఈరోజు ర్యాలీ జరుగుతుందని నేనసలు అనుకోలేదని… పోలీసులు వైసీపీ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడు బయటికి రావాలో అచ్చెన్నాయుడుకి తెలుసని… జగన్ ను ఎప్పుడు గద్దె దించాలో కూడా […]
ఐసిస్‌పై అమెరికా ప్రతీకార దాడులు ప్రారంభించింది. కాబూల్ పేలుళ్లకు పాల్పడ్డ ఐసిస్-కె టెర్రరిస్టులపై డ్రోన్ దాడులు జరిపింది. పేలళ్ల బాధ్యులైన వారిని వెంటాడి వేటాడి చంపుతాం అని అధ్యక్షుడు జో బైడన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా ఈ దాడులు చేపట్టింది. శనివారం తూర్పు ఆఫ్గనిస్తాన్‌లోని నంగర్‌హార్ ప్రావిన్స్‌లో డ్రోన్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇస్లామిక్‌స్టేట్ తీవ్రవాదుల అడ్డాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో కాబూల్ పేలుళ్ల మాస్టర్‌మైండ్ హతమయ్యాడు. అయితే దీనిని అమెరికా సైనిక అధికారులు […]
అమరావతి : పదో తరగతిలో మళ్లీ మార్కుల విధానాన్ని పునరుద్ధరిస్తూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల స్థానంలో మార్కుల విధానాన్ని తీసుకువస్తున్నట్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. విద్యార్ధుల్లో ప్రతిభను గుర్తించేందుకు మార్కుల విధానమే సరైదంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సిఫార్సులు చేశారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సీబీఎస్ఈ అనుసరించే గ్రేడింగ్ విధానాన్ని 2019 వరకూ అమలు చేసింది ప్రభుత్వం. కోవిడ్ కారణంగా 2020లో పదో తరగతి పరీక్షలు రద్దు కావటంతో గ్రేడ్ […]
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ వ్యవసాయం రంగంలో సమూల మార్పులకు నాంది పలుకుతూ… కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టాలను కేంద్రం ప్రతిపాదించినప్పటి నుంచి… బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అటు ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ చట్టాలను వ్యతిరేకించాయి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది తమిళనాడు సర్కార్. శాసన సభలో మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని […]
నేడు గ్రేటర్ హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంచల్ గూడ లో జీహెచ్‌ఎంసీ నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. హైద్రాబాద్ ను స్లమ్ ఫ్రీ సిటీగా చేసేందుకు గతంలో మురికివాడగా ఉన్న పిల్లి గుడిసెల బస్తీ… లో రూ. 24.91 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల్లో 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిచింది జీహెచ్‌ఎంసీ. ఒకటిన్నర ఎకరాలు ఉన్న ఈ స్థలంలో 288 డబుల్ […]
ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ – వైఎస్ భారతిల 25 వ వివాహ వార్షికోత్సవం. ఈ నేపథ్యం లో వైసీపీ పార్టీ లో కోలాహలం నెలకొంది. ఇక అటు వైసీపీ మంత్రులు మరియు ఎమ్మెల్యే లతో పాటు పలువురు నాయకులు జగన్ దంపుతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేరకు ఏపీలో ఓ భారీ కటౌట్ సందడి చేస్తోంది. శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధు సూదన్ రెడ్డి ఈ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. జగన్- […]
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకానికి ఆగస్ట్ 16న శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. హుజురాబాద్‌లో పర్యటించి మరీ… ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధును ప్రారంభించారు. ముందుగా అర్హులైన 15 కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు ముఖ్యమంత్రి. అయితే… తాజాగా దళితబంధు ఇంటింటి సమగ్ర సర్వే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం ప్రారంభమైంది. సర్వే కోసం దళితవాడలకు వచ్చిన […]