దేశంలో కరోనా టెర్రర్ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 46,759 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,26,49,947 కి చేరగా ఇందులో 3,18,52,802 మంది ఇప్పటికే కోలుకున్నారు. 3,59,775 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 509 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 4,37,370 మంది కరోనాతో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో […]
అఫ్ఘానిస్థాన్ ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై అమెరికా డ్రోన్ దాడులు చేసింది. ఇస్లామిక్ శిబిరాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసిన నేపథ్యం లో కాబూల్ విమానాశ్రయాన్ని ఖాలీ చేయాలని పౌరులను అమెరికా హెచ్చరించింది. ఇటీవల కాబూల్ విమానాశ్రయం వెలువల జరిగిన రెండు ఆత్మహుతి దాడుల్లో 13 మంది అమెరికా సైనికులతో పాటు సుమారు 100 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా అగ్రరాజ్యం డ్రోన్ దాడులకు పాల్పడింది. కాబుల్ విమానాశ్రయం వెలుపల జంట పేలుళ్లకు కారణమైన […]
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. అందులో ఇటీవలే పెళ్లి అయిన ఓ మహిళ ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. నిర్మల్ జిల్లా కడెం మండలం పాండవ పూర్ బ్రిడ్జి వద్ద అదుపు తప్పి.. కారు బోల్తా కొట్టింది. అయితే… ఆ కారులో ప్రయాణిస్తున్న పెండ్లి కూతురు మౌనిక మరియు పెండ్లి కూతురు తండ్రి రాజాం అక్కడిక్కడే మృతి చెందారు. […]
తీన్మార్ మల్లన్న అరెస్ట్ అయ్యారు. మల్లన్న అలియాస్ చింత పండు నవీన్ ను అర్థరాత్రి అరెస్ట్ చేశారు చిలకలగూడ పోలీసులు. తీన్మార్ మల్లన్న తనను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు లక్ష్మీకాంత్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ. 30 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసాడని, ఇవ్వక పోయేసరికి తనను బ్లాక్ మెయిల్ చేశాడంటూ ఫిర్యాదు చేశాడు జ్యోతిష్య నిపుణులు లక్ష్మీకాంత్ శర్మ. ఈ మేరకు ఇప్పటికే తీన్మార్ మల్లన్న […]
ఇవాళ్టి నుంచి ”ప్రజా సంగ్రామ యాత్ర” పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నారు బండి సంజయ్.. అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన విముక్తి కోసం తన పాదయాత్ర అని ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించనున్నారు సంజయ్… అక్టోబర్ 2వ తేదీ వరకు మొదటి విడత పాద యాత్ర నిర్వహించనున్నారు. ఇక, రోజుకు మినిమం 10 కిలోమీటర్లు పాద యాత్ర చేయనున్నారు బండి సంజయ్.. ఇవాళ, రేపు […]
ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 44,400 కి చేరింది. ఇక 10 గ్రాముల […]
ఖాకీలకు కొన్ని పోలీస్ స్టేషన్లపై సెంటిమెంట్ ఎక్కువ. కలిసి వస్తుంది అనుకుంటే.. పోస్టింగ్‌ల కోసం ఓ రేంజ్‌లో పైరవీలు చేస్తారు. అదే రివర్స్‌లో ఉంటే పోలీస్ స్టేషన్ పేరు చెబితేనే హడలెత్తిపోతారు. ప్రస్తుతం ఆ PS గురించి అదే చర్చ జరుగుతోంది. మాకొద్దీ తలనొప్పి అని విసుగెత్తిపోతున్నారట అధికారులు. వైసీపీ, టీడీపీ మధ్యలో పోలీస్‌గా చర్చల్లో ఉన్న ఆ కథేంటో ఈ స్టోరీలో చూద్దాం. అధికారులు లేక స్టేషన్ ఖాళీ! చిత్తూరు జిల్లా చంద్రగిరి. పోలీస్‌శాఖ పరంగా […]
తెలంగాణ ఆర్టీసీని సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ సెట్ చేస్తారా? పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ముద్రపడ్డ ఆయన్ని ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీకి పంపింది? ఎవరికి చెక్ పెట్టేందుకు తీసుకొచ్చారు? ఆర్టీసీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? సీనియర్ ఐపీఎస్‌తో మంత్రికి సఖ్యత కుదురుతుందా? తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు MDగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ వచ్చారు. ఈ నియామకంపై ఆర్టీసీతోపాటు.. ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీకి పూర్తిస్థాయి MD […]
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు.. చేసే సమీక్షల్లో కొన్ని రహస్యంగా ఉంటాయి.. మరికొన్ని బయటకు చెబుతారు. కానీ.. రహస్యంగా ఉంచాల్సిన అంశాలే ఏపీలో బయటకొచ్చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి చికాకులు తప్పడం లేదు. అందుకే కీలక నిర్ణయాలు తీసుకున్నారట. వాటిపైనే ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. లీకులపై విపక్షాలకు సమాధానాలు చెప్పడానికే టైమ్ సరిపోతోందా? ఆర్థికపరమైన అంశాలు.. ప్రభుత్వం వేసుకున్న లెక్కలు.. అందులో తప్పిదాలు.. నిర్లక్ష్యాలు.. నిబంధనల ఉల్లంఘనలు అంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. వీటికి […]
అసలే అంతంత మాత్రంగా పనిచేస్తున్న వేళ.. పదవుల పంపకం కేడర్‌కు ఆగ్రహం తెప్పించిదట. పార్టీ జిల్లా పెద్దలు కూడా వారిని పట్టించుకోలేదని టాక్. ఎన్నికల్లో గెలిచిన ఆ ఒక్కరినీ పరిగణనలోకి తీసుకోలేదట. అదే చిత్తూరు జిల్లా టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ గొడవేంటో ఈ స్టోరీలో చూద్దాం. టీడీపీ కమిటీల కూర్పుపై కేడర్ ఫైర్! అనుబంధ సంఘాల పదవుల కేటాయింపు తిరుపతి టీడీపీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. పదవుల భర్తీలో సమతూకం పాటించలేదనే విమర్శలు గుప్పుమన్నాయి. […]