ఉస్మానియా ఆస్పత్రిలో ఫేక్ డాక్టర్ ఘటన కలకలం రేపింది. ఉస్మానియా ఆసుపత్రి లో నకిలీ డాక్టర్ గా చలామణి అవుతున్న నిందితున్ని అఫ్జల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ఉస్మానియా ఆసుపత్రి కి అలీ అనే వ్యక్తి డాక్టర్ కోట్, మెడలో స్టెతస్కోప్ వేసుకొని దర్జాగా ఆసుపత్రి అత్యవసర విభాగం లో తోటి వైద్యులతో సమానంగా కూర్చున్నాడు. అయితే… కొద్దీ సేపటి తర్వాత క్యాజ్‌వాలిటీ సీఎంఓ అతని ప్రవర్తన పై ఆరా […]
తెలంగాణ పోలీస్ శాఖ లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం లో 19 మంది డీఎస్పీ లు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న జి. హనుమంత రావును కూకట్ పల్లి ట్రాఫిక్ ఏసీపీ గా బదిలీ చేశారు. ఇక ఇప్పటి వరకు కూకట్ పల్లి ట్రాఫిక్ ఏసీపీ […]
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఉత్కంఠ రేపుతోంది. ఎవరికి వారే తమ తమ వాటాల కోసం పట్టుబడుతుండడంతో ఈ పంచాయతీ ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. మరోవైపు ఇటీవల సమావేశాలకు హాజరుకాని తెలంగాణ… సెప్టెంబర్ 1న జరిగే KRMB మీటింగ్‌కు హాజరవ్వాలని నిర్ణయించింది. ఈసారి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ఈ సమావేశానికి వెళ్లనున్నారు. న్యాయంగా రావాల్సిన కృష్ణా జలాల్లో ఒక్క బొట్టుకూడా వదులుకునేది లేదని తేల్చి చెప్పేశారు. కృష్ణా జలాలపై కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో […]
జేఈఈ మెయిన్ చివరి విడత(నాలుగు) పరీక్షలు దేశవ్యాప్తంగా గురువారం మొదలుకానున్నాయి. ఈ నెల 26, 27, 31, సెప్టెంబరు 1, 2వ తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొదటి రోజు బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత నుంచి బీటెక్ కోసం పేపర్-1 నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 7.40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత దేనిలో అధిక స్కోర్ వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకొని […]
హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. తెల్లవారుజాము నుంచే కుండపోత వానమొదలైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌లో భారీగా వర్షం కురిసింది. అబిడ్స్, కోఠి, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్‌లో ప్రధాన రహదారులపై వరద పొంగిపొర్లుతోంది. కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ, జగద్గిరిగుట్టలో కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. లక్డీకాపూల్, సికింద్రాబాద్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ జంక్షన్లలోని రోడ్లపై నీళ్లు చేరాయి. రహదారులపై చేరిన నీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తోంది. గండిపేట్, […]
దేశంలో కరోనా టెర్రర్ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 46,164 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,58,530 కి చేరగా ఇందులో 3,17,88,440 మంది ఇప్పటికే కోలుకున్నారు. 3,33,725 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 607 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 4,36, 365 మంది కరోనాతో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. […]
కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకు 60 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా కార్యక్రమంలో వేగం పెరగడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. చాలా రాష్ట్రాలు స్కూళ్లు తెరిచేందుకు నిర్ణయం తీసుకున్న వేళ.. కీలక సూచనలు చేసింది. సెప్టెంబర్ 5లోగా వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలకు అదనంగా 2 కోట్ల డోసులు పంపినట్లు తెలిపింది. టీచర్స్ డే కంటే ముందుగానే లక్ష్యాన్ని పూర్తి […]
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి చామకూర మల్లారెడ్డి పై కాంగ్రెస్ నేతలు మరియు కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యం లోనే బోయినిపల్లి లో ఉన్న మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు దళిత కాంగ్రెస్ నాయకులు. దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతమ్ ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే.. ఈ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దళిత కాంగ్రెస్ నాయకులు మరియు పోలీసుల […]