ఇవాళ రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు అధికార పార్టీ సిద్దమైంది. పూర్తిస్థాయి అజెండాతో సభ నడిపించడానికి స్పీకర్, అధికారులు కసరత్తు చేశారు. ఐటీ శాఖపై స్వల్పకాలిక చర్చతో ప్రభుత్వం చర్చను ప్రారంభించనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ఇవాళ్టి నుంచి ఉదయం 10 గంటలకే మొదలవుతాయి. సభ మొదటి రోజు 11 గంటలకు ప్రారంభమైంది. అసెంబ్లీలో పూర్తిస్థాయి అజెండా అమలు కానుంది. మొదట ప్రశ్నోత్తరాలు..తర్వాత జీరో అవర్..బ్రేక్ తర్వాత…షార్ట్ డిస్కషన్- ఐటీ శాఖ..ఐటీ పురోభివృద్దిపై చర్చించాలని స్పీకర్ నిర్ణయించారు. కాగా.. మొన్నటి రోజున ప్రారంభం అయిన అసెంబ్లీ సమావేశాలు… సంతాప తీర్మానాల అనంతరం వాయిదా పడ్డాయి.