కలిసి పనిచేయాలని వైసీపీ అధినేత ఆదేశించినా ఆ యువ నేతలు ఖాతరు చేయడం లేదా? ఇప్పటికీ ఎడముఖం పెడముఖమేనా? అమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధపడ్డారా? ఎవరా నాయకులు? ఏమా కథ? కలిసి మీడియా ముందుకు రాలేదు..! రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య రగడపై పది రోజుల క్రితమే వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎదుట పంచాయితీ జరిగింది. ఇద్దరినీ కలిసి పనిచేయాలని అధినేత ఆదేశించినట్టు సమాచారం. కానీ.. క్షేత్రస్థాయిలో వర్గాలు ఏకం […]
హుజురాబాద్ ఉపఎన్నికను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంటుందా? ఇంకా గ్రౌండ్‌లోకి ఎందుకు ఎంట్రీ ఇవ్వలేదు? పరువుకు ప్రాధాన్యం ఇచ్చి.. ఫలితం గాలికి వదిలేసిందా? ఇంకా మొదలు కాని కాంగ్రెస్ ప్రచారం..! హుజురాబాద్ ఉపఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ మొదటి నుంచి నాన్ సీరియస్సే. గాంధీభవన్‌లో ఉపఎన్నిక సందడే లేదు. అసలు రాష్ట్రంలో ఒక ఉపఎన్నిక జరుగుతుందనే సోయి పార్టీ నేతల్లో ఉందో లేదో అనే డౌట్ కేడర్‌ది. మాజీ మంత్రి కొండా సురేఖను బరిలో దించాలని భావించి భంగపడింది. ఆమె […]
కడప జిల్లాలోని బద్వేల్ ఉప ఎన్నికకు రోజులు దగ్గరపడుతున్నాయి. దీంతో అక్కడ రాజకీయవేడి రాజుకుంటోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ గెలుపు లాంఛనమే అని అంతా భావిస్తున్నారు. అయినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి బద్వేల్ పై ప్రత్యేకంగా గురిపెట్టారు. వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు రాకుండా చూడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఉప ఎన్నికలో వైసీపీ ఏమేరకు మెజార్టీ సాధిస్తుందనేది ఆసక్తికరంగా […]
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఈ ఎన్నికను బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు రసవత్తరంగా మారింది. కురుక్షేత్రాన్ని తలపించేలా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే కాంగ్రెస్ ఈ రేసులో బాగా వెనుకబడినట్లు కన్పిస్తోంది. దీంతో త్రిముఖ పోటీ కాస్తా ద్విముఖ పోటీగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కాంగ్రెస్ ఏ క్షణానైనా పుంజుకునే అవకాశం ఉందని ఆపార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈనెల తొలివారం […]
తెలుగు విశ్వ విద్యాలయంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళ్ సై మరియు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ…. బతుకమ్మ పాటలలో ఉండే తెలుగు పదాల మీద పరిశోధన చేస్తే, తెలుగు బాష మరింత పరిపుష్టం అవుతుందన్నారు. తెలంగాణ జాగృతితో పాటు, అనేక సంస్థలు బతుకమ్మ పండుగకు సంబంధించి పాత పాటలు సేకరిస్తున్నారని… పాత బతుకమ్మ పాటల్లో ఉండే పదాల మీద ప్రత్యేక అధ్యయనం చేసినట్లైతే, […]
అనంతపురం : ఏపీ సర్కార్ పై మరోసారి ఫైర్ అయ్యారు పయ్యావుల కేశవ్. జగన్ ప్రభుత్వం అసమర్థత వల్ల విద్యుత్ రంగంలో తప్పులు జరుగుతున్నాయని… రాయలసీమ పవర్ ప్లాంట్ ను అన్యాయంగా మూసివేశారని మండిపడ్డారు. అత్యధిక ధరలకు విద్యుత్ ను బయట నుంచి కోనుగోలుచేయడం ఎవరిదీ తప్పు…? అని ప్రశ్నించారు పయ్యావుల. ప్రస్తుతం విద్యుత్ సంస్థలో ప్రక్షాళన అవసరమన్నారు పయ్యావుల. ట్రూ అప్ పేరు ఎక్కడి నుంచి వచ్చిందని… ట్రూ అప్ ఛార్జీలను ఎందుకు విత్ డ్రా […]
దిశా కమిషన్ విచారణ మరొకసారి వాయిదా పడింది. వచ్చే సోమవారం సజ్జనార్ ను విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రెండు సార్లు సజ్జనార్ విచారణ కమిషన్ వాయిదా వేసింది. వచ్చే సోమవారం ఈ విచారణ కమిషన్ చేపట్టనుంది. దీంతో వచ్చే సోమవారం విచారణ కు హాజరు కానున్నారు సజ్జనార్. కాగా.. దిశ నిందితుల ఎన్ కౌంటర్ సమయంలో సైబరాబాద్ సీపీ గా సజ్జనార్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్ కౌంటర్ […]
త్వరలోనే ఇండ్ల స్థలం ఉన్న వారికి రూ. 5 లక్షలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ అసెంబ్లీ ఆయన డబుల్ బెడ్రూం ఇండ్లపై మాట్లాడుతూ… డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం విషయంలో కొందరు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. ప్రధాని మోడీని రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ సమగ్ర సర్వేలో ఇండ్లు లేని వాళ్ళు దాదాపుగా 26,31,739 ఇండ్ల కోసం […]
ఢిల్లీ : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతుల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు.. సి ఆర్ పి సి ప్రకారం ప్రాథమిక విచారణ అవసరం లేదని పేర్కొంది. ప్రాథమిక విచారణ చేసిన తర్వాతే కేసు నమోదు చేయాలనే హక్కు నిందితుడికి లేదని…జస్టిస్ చంద్ర చుడ్ ధర్మాసనం తీర్పు ప్రకటించింది. ఇక ఈ కేసులో ప్రాథమిక విచారణ జరపకుండా […]
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 21, 257 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 271 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3.32 కోట్ల మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,50, 127 మంది మృతి చెందారు. దేశంలో 2,40, 221 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు […]