శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ మధ్య టీడీపీ దీన్ని బాగా ఫాలో అవుతోంది. ఒకప్పటి ఆప్త మిత్రుడు పవన్‌కు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తోంది. ఆయన్ను వైసీపీ విమర్శిస్తే టీడీపీ కస్సుమని ఒంటి కాలిపై లేస్తోంది. అది పార్టీలోని ఓ వర్గ నేతలకు అస్సలు నచ్చడం లేదట. మనల్ని పట్టించుకోని అతనికేంటి అంత ప్రయార్టీ అంటూ ఒకటే గుసగుసలు.. రుసరుసలట..! ఇటీవల పవన్‌కు అండగా టీడీపీ కామెంట్స్..! ఇటీవల ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే పొత్తులు.. సమీకరణాలు […]
నందికొట్కూరు వైసీపీ గురించి చెబితే.. అక్కడి నాయకుల కంటే.. వారి మధ్య ఆధిపత్యపోరే ఎక్కువ హైలెట్. ఎమ్మెల్యే ఆర్థర్, పార్టీ ఇంఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉప్పు నిప్పులా ఉంటారు. వారే కాదు.. వారి అనుచరులు కూడా అంతే. ఇప్పుడు కొత్త గొడవ ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్. అదేంటో లెట్స్ వాచ్..! ఆధిపత్యపోరులో దాడులు.. హత్యాయత్నాలు..! కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ మధ్య […]
గడిచిన రెండేళ్లుగా ప్రపంచం కరోనాతో కాకవికలమవుతోంది. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా మహమ్మరి క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. కరోనా ఎంట్రీతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఎంతోమంది అమాయకులు ఈ మహమ్మరి బారినపడి మృతిచెందారు. మరికొంతమంది మృత్యువు అంచులదాకా వెళ్లి బయటపడిన సంఘటనలు ఉన్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ లో అమెరికా, ఇటలీ, బ్రిటన్ వంటి అగ్రదేశాలు ఎక్కువగా నష్టపోయాయి. భారత్ తొలి వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంది. అయితే ఊహించని విధంగా సెకండ్ […]
గత ఏడేళ్లుగా ప్రధాని మోడీ మాత్రమే ఏపీని అభివృద్ధి చేస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి హైవే లు, ఫ్లై ఓవర్లు, ఎయిమ్స్ వంటివి కేంద్రమే రాష్ట్రంలో నిర్మాణం చేస్తుందని.. రూ. 2 వేల కోట్లతో టెండర్లు పిలిచినా ఎవరూ రాని దౌర్భాగ్య స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. రోడ్ల మరమత్తులు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేశారని కానీ…. తాము 7 నెలల క్రితమే చేపట్టామన్నారు. టిడ్కో ఇళ్ల కోసం కేంద్రం […]
బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించే బాధ్యత సమాజంలో మనందరిపై ఉందని తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ లోని ఎమ్ ఎన్ జె క్యాన్సర్ హాస్పటల్ లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ వాక్’ ను ఎమ్మెల్సీ కవిత జెండా ఊపి ప్రారంభించారు. గతంలో 60 ఏండ్ల పైబడిన వాళ్లకు వచ్చే క్యాన్సర్ ఇప్పుడు 30 సంవత్సరాలకే వస్తున్నదని, కాబట్టి జాగ్రత్తలు […]
సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే సీఎం జగన్ మంత్రులకు కీలక సూచనలు చేసినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ ప్రతిపక్ష పార్టీలు నిశితంగా గమనిస్తూనే తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు పొత్తులతో వెళుతారా? లేదంటే సోలోగానే ఎన్నికలకు వెళుతారా? అనే చర్చ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతోంది. […]
అమరావతి : ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణం వైసీపీ ప్రభుత్వమేనని…ఫైర్ అయ్యారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. విద్యుత్ విషయంలో విభజన నాటికి ఏపీ మిగుల్లో ఉంటే.. తెలంగాణ లోటులో ఉందని… అలాంటిది ఇప్పుడు విద్యుత్ విషయంలో సీన్ రివర్స్ అయిందని మండిపడ్డారు. ఆర్ధిక రంగాన్ని కుదేలు చేసినట్టే.. విద్యుత్ రంగాన్ని కుదేలు చేశారని నిప్పులు చెరిగారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. సీఎం జగన్ కు అధికారులు తప్పుడు సమాచారం అందిస్తున్నారని… సీఎం నోటి వెంట […]
దేశవ్యాప్తంగా వరుసగా ఐదో రోజు పెరిగాయి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు. పెరిగిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 103.84 కాగా… లీటర్ డీజిల్ రూ. 92.47 గా నమోదైంది. ముంబైలో పెట్రోల్ రూ. 109.84, కాగా… డీజిల్ రూ .100.29 కు పెరిగింది.కోల్‌కతాలో పెట్రోల్ రూ. 104.52 కాగా.. డీజిల్ రూ. 95.58 గా నమోదైంది. అలాగే… చెన్నైలో పెట్రోల్ రూ .101.27 […]