తెలుగు అకాడమీ స్కాం పై విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగుతుంది. తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ లో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందని సిసిఎస్ పోలీసులు గుర్తించారు. మనీలాండరింగ్ తో పాటు హవాలా లావాదేవీలు జరిగిన నేపథ్యంలో దీనిపై విచారణ జరపాలంటూ సిసిఎస్ పోలీసులు ఈడి కి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఈడి అధికారులు వెంటనే కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు తెలుగు అకాడమీ నిధులను కొట్టేసి నిందితులు పెద్ద ఎత్తున […]
ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ తయారీదారు జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎఫ్ ఇండియా) అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబాయిల్ అవార్డు 2021 వద్ద భారతదేశంలో అత్యధికంగా ముడి పొద్దు తిరుగుడు పువ్వు నూనె(క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్)ను దిగుమతి చేసుకుంటున్న సంస్థల విభాగంలో ప్లాటినమ్ అవార్డును అందుకుంది. వంటనూనెల పరిశ్రమలో పలు విభాగాలలో నిర్వహించే కార్యక్రమాలలో అత్యున్నత ప్రతిభను కనబరిచిన సంస్థలను గుర్తించడంలో అత్యంత విశ్వసనీయమైనది గ్లోబాయిల్ అవార్డ్స్. ఈ గుర్తింపుతో జీఈఎఫ్ ఇండియా భారతదేశంలో […]
మహిళలంతా భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడుతుండగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి కారు బతుకమ్మల మీదుగా దూసుకెళ్లడం వివాదంగా మారింది. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలకేంద్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఆత్మకూరు వచ్చిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో వేణుగోపాలస్వామి దేవాలయం ఎదుట మహిళలు బతుకమ్మలు ఆడుకుంటున్నారు. ఎమ్మెల్యే వస్తున్నారని, రోడ్డుపై నుంచి బతుకమ్మలు తీసివేయాలని మహిళలను ధర్మారెడ్డి అనుచరులు చెప్పారు. మహిళలు కుదరదనడంతో.. వారిని తోసేసి బతుకమ్మల మీదుగా ఎమ్మెల్యే కారును పోనిచ్చారు. […]
హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. నామినేషన్లకు నేటితో గడువు ముగిసిపోనుంది. చివరి రోజు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇండిపెండెంట్లు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు 15 మంది నామినేషన్లు వేశారు. మొదటిరోజు రెండు నామినేషన్లు దాఖలు కాగా… గురువారం 6 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో.. ప్రధాన పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు […]
తెలంగాణ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారానికి గురైన బాలిక దాల్చిన గర్భాన్ని తొలగించేందుకు అనుమతిచ్చింది. పిండం హక్కుల కంటే.. అత్యాచార బాధితురాలికి రాజ్యాంగం కల్పించిన హక్కులే ప్రాధాన్యమని స్పష్టం చేసింది. అత్యాచారానికి గురైన బాలిక అబార్షన్‌కు హైకోర్టు అంగీకరించింది. 26 వారాల పిండాన్ని తొలగించేందుకు అనుమతి ఇచ్చింది. కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు హైకోర్టు ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీచేసింది. నిపుణులతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి ఈ కీలక […]
కీలక మ్యాచ్‌లో కోల్‌కతా ఆటగాళ్లు చెలరేగిపోయారు. రాజస్థాన్‌పై భారీ విజయం సాధించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభమన్ గిల్ హాఫ్ సెంచరీతో.. వెంకటేశ్ అయ్యర్ 38 పరుగులతో రాణించారు. తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా బ్యాట్‌కు పనిచెప్పారు. దినేశ్ కార్తీక్ , మోర్గాన్ నాటౌట్‌గా నిలిచారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సంజు సేన..85 పరుగులకే కుప్పకూలింది. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌లో రాహుల్ […]
బిగ్ బాస్ సీజన్ 5 ఐదవ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా జరిగిన ‘రాజ్యానికి ఒక్కడే రాజు’ టాస్క్ కు 31వ రోజు రాత్రి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే ఏ రాజకుమారుడి దగ్గర ఎన్ని నాణేలు ఉన్నాయనే లెక్కింపును మర్నాడుకు వాయిదా వేశాడు బిగ్ బాస్. ఇక 31వ తేదీ రాత్రి ఓ శుభపరిణామంతో ముగిసింది. అదే ప్రియాంక సింగ్ బర్త్ డే వేడుక! జండర్ ఛేంజ్ చేసుకున్న ప్రియాంక సింగ్ పట్ల కినుక […]
రోజు రోజు బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు తగ్గిన బంగారం ధరలు.. గత వారం రోజుల నుంచి విపరీతంగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 43,800కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 47,780 కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో […]
గతంలో మాదిరి ఇప్పుడు నవలా చిత్రాలు తెలుగులో రావడం తగ్గిపోయింది. ఆ లోటును తీర్చుతూ, ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవలను క్రిష్ జాగర్లమూడి అదే పేరుతో వెండితెరకెక్కించారు. తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే నటుడిగా గుర్తింపుతో పాటు, మంచి విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. కడప జిల్లాకు చెందిన కఠారు రవీంద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) అనే కుర్రాడి […]
ఆ మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ కీలకంగా భావించే ప్రాంతానికి చెందిన నాయకుడు. నియోజకవర్గానికి పార్టీ ఇంఛార్జ్ కూడా. ఆయనకు తెలియకుండానే అక్కడ కొందరికి పార్టీ పదవులు ఇచ్చేశారు. పార్టీ ఆయన్ని పట్టించుకోవడం లేదా? సైడ్ చేసిందా? లైట్ తీసుకుంటుందా? ఎవరా నాయకుడు? ఏంటా ప్రాంతం? శ్రావణ్ కుమార్‌కు చెప్పకుండానే స్థానికులకు టీడీపీలో పదవులు..! శ్రావణ్ కుమార్. టీడీపీ మాజీ ఎమ్మెల్యే. రాజధాని అమరావతిలోని కీలక నియోజకవర్గమైన తాడికొండలో 2014లో టీడీపీ నుంచి గెలిచారు. గత ప్రభుత్వం అమరావతికి […]