దిశా కమిషన్ విచారణ మరొకసారి వాయిదా పడింది. వచ్చే సోమవారం సజ్జనార్ ను విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రెండు సార్లు సజ్జనార్ విచారణ కమిషన్ వాయిదా వేసింది. వచ్చే సోమవారం ఈ విచారణ కమిషన్ చేపట్టనుంది. దీంతో వచ్చే సోమవారం విచారణ కు హాజరు కానున్నారు సజ్జనార్. కాగా.. దిశ నిందితుల ఎన్ కౌంటర్ సమయంలో సైబరాబాద్ సీపీ గా సజ్జనార్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్ కౌంటర్ ఘటనపై సజ్జనార్ స్టేట్మెంట్ నమోదు చేయనుంది దిశా కమిషన్. అలాగే… ఎన్ కౌంటర్ బాధిత కుటుంబాలను, సిట్ చీఫ్ మహేష్ భగవత్, పలువురు సాక్ష్యుల వాగ్మూలాలు నమోదు చేసింది కమిషన్.
—-రమేష్ వైట్ల