Congress: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ జనవరి 14న మణిపూర్ నుంచి ప్రారంభం కానుంది. దేశంలోని ప్రాథమిక సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై దృష్టి సారిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఈ సందర్భంగా భారత్ జోడో న్యాయ్ యాత్ర “న్యాయ్ కా హక్ మిల్నే తక్” లోగోతో పాటు ట్యాగ్‌లైన్‌ను ఆవిష్కరించారు. ఇక, జనవరి 14 నుంచి భారత్ జోడో న్యాయ యాత్రను రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రారంభించబోతున్నామన్నారు. ఈ యాత్ర మణిపూర్‌లోని ఇంఫాల్ నుంచి ప్రారంభమయ్యే ముంబయిలో ముగియనుంది. దాదాపు దేశంలోని 15 రాష్ట్రాల గుండా యాత్ర కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. 110 జిల్లాలోని 100 లోక్‌సభ స్థానాలతో పాటు 337 అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనుంది.
Read Also: Biggest Gold Owner in India: భారత్ లో అత్యధిక బంగారం ఎవరి దగ్గర ఉంది? 2,26,79,618 కిలోల యజమాని ఎవరు?
దీని తర్వాత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. ఈ సత్య మార్గంలో నేను ప్రమాణం చేస్తున్నాను.. నాకు న్యాయం జరిగే వరకు ప్రయాణం కొనసాగుతుంది అని చెప్పుకొచ్చారు. 67 రోజుల్లో 6,700 కిలోమీటర్లకు పైగా యాత్ర సాగుతుందని ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ధనంజయ్ ఠాకూర్ గతంలో చెప్పారు. ఈ యాత్ర ఫిబ్రవరి 16-17 తేదీల తర్వాత ఛత్తీస్‌గఢ్‌కు చేరుకుంటుందన్నారు. ఐదు రోజుల్లో రాష్ట్రంలోని ఏడు జిల్లాలను రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర కవర్ చేయనుందని చెప్పుకొచ్చారు. ప్రజల హక్కుల కోసం పోరాడేందుకు సత్యాగ్రహాన్ని బలమైన ఆయుధంగా కాంగ్రెస్ పరిగణిస్తోంది.. స్వాతంత్య్రానంతరం దేశంలోనే అతి పెద్ద యాత్రగా ‘భారత్ జోడో న్యాయ్ పాదయాత్ర’ చరిత్రలో నిలిచిపోతుందని ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ధనంజయ్ ఠాకూర్ వెల్లడించారు.
Congress President Shri Mallikarjun @Kharge launches logo & slogan of the upcoming yatra!
Bharat Jodo Nyay Yatra
Nyay Ka Haq Milne Takभारत जोड़ो न्याय यात्रा
न्याय का हक़ मिलने तक! pic.twitter.com/blqYuOH3qz— Gaurav Pandhi (@GauravPandhi) January 6, 2024