ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో వెలసిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార శుభాకాంక్షలతో బ్యానర్లు వెలశాయి. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసిన బ్యానర్లను టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు.
కృష్ణా నదికి వరద ప్రవాహం భారీగా వస్తుంది. గడిచిన కొన్ని రోజులుగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండంతో నదిలోనికి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. దీనికి తోడు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఈ వరద నీరంత ప్రస్తుతం కృష్ణా నదిలోకి వచ్చి చేరడంతో నీటి ప్రవాహం గంట, గంటకు పెరుగుతుంది.
ప్రగతి భవన్ ముందున్న బ్యారికేడ్స్ లోపలి నుంచి ట్రాఫిక్ కు పోలీసులు అనుమతి ఇచ్చారు. బ్యారికేడ్స్ తొలగింపుతో ట్రాఫిక్ కు పర్మిషన్ ఇచ్చారు. ట్రాఫిక్ పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈ చర్య కొనసాగుతుంది.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయానికి చేరుకున్న సీఎం జగన్ కు వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు నృత్యాలతో పిల్లలు, నాట్యకారులు అలరించారు. అలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంఖుస్థాపన చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు రెడీ అవుతున్నారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో ఆయన పర్యటించబోతున్నారు. రేపు పొన్నూరు, వేమూరు, తెనాలి, బాపట్ల నియోజకవర్గాల్లో పర్యటనకు వెళ్లబోతున్నారు.
నేడు విశాఖపట్నంలో ఎస్.రాజా గ్రౌండ్స్ లో జనసేన బహిరంగ సభ జరుగనుంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో పలువురు వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులు చేరనునన్నారు. ఇక, మధ్యాహ్నం నగరానికి జనసేన చీఫ్ రానున్నారు. ప్రస్తుతం రాష్ట్ర సమస్యలు, తుఫాన్ నష్టం, రైతులు పడుతున్న ఇబ్బందులు, తాజా రాజకీయాలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారని పార్టీ వర్గాల వెల్లడించాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. తొలి కాంగ్రెస్ సీఎంగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04కి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాన్ తో పంట నష్టపోయిన రైతాంగాన్నివెంటనే ఆదుకోవాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కోరారు. రైతులకు ఉదారంగా ఆర్ధిక సహకారం అందించాలి అని ఆమె తెలిపారు.