తెలంగాణ రాజ్ భవన్ కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవితో పాటు ఇతర సీనియర్ నేతలు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టు సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కు కాంగ్రెస్ బృందం అందజేసింది.
ఏపీలోని తుపాను ప్రభావిత పరిస్థితులపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఖమ్మం జిల్లా ఏ మాటకు ఆమాట కాంగ్రెస్ జిల్లా అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. పోయినసారి ఇదే ఫలితం వచ్చింది... మేము ఇతర పార్టీల్లో గెలిచాం.. పువ్వాడ అజయ్ మాత్రమే పార్టీలో గెలిచారు.. జిల్లాలో కాంగ్రెస్ గాలి మనకు ఉరితాళ్ళు అయినవి.. తమ్మినేని వీరభద్రంకు కూడా ఓట్లు పడలేదు అని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డా. బీఆర్. అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇవాళ మధ్యహ్నం ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణకు వచ్చాక తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. సీఎల్పీ నేతగా తనను ప్రకటించిన నేపథ్యంలో వారిద్దరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు. కాగా, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతో ఆయన సమావేశం అయ్యారు. రేపు (గురువారం) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగబోయే తన ప్రమాణస్వీకారానికి వారిని ఆహ్వానించారు.
తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక, తొలి సంతకం దేనిపై చేస్తాడు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలు ఫైల్ మీద తొలి సంతకం చేయాలని నిర్ణయించారు.
యూపీలో కాంగ్రెస్ జోరు కాస్త తగ్గింది. తెలంగాణలో పార్టీ విజయం తర్వాత యూపీలో ముస్లిం ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. భారత కూటమిని సజీవంగా ఉంచడానికి యూపీలో కాంగ్రెస్ అనేక రాజీలు చేయాల్సి రావచ్చు.. ఇది జరగకపోతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో ఆ పార్టీ ఒంటరి అవుతుంది అని సమాజ్ వాద్ పార్టీ నేతలు చెబుతున్నారు.
నేడు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ భీంరావు అంబేద్కర్ 67వ వర్ధంతి.. ఈ సందర్భంగా ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పూజ్యమైన బాబా సాహెబ్ అంబేద్కర్ జీ తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారన్నారు.
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా ఇల్లందు సింగరేణి ఏరియాల్లో ఎడ తెరిపిలేని వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కోయగూడెం ఉపరితల గనిలో 13 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 45 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయింది.