బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ( బీసీసీఐ).. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరుగాంచింది. ప్రపంచ క్రికెట్లో తమ ఆధిపత్యాన్ని భారత క్రికెట్ బోర్డు ఇప్పటికి కొనసాగిస్తోంది.
తమిళనాడు రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉత్తర చెన్నైలోని మనాలి సమీపంలోని వైకాడు ప్రాంతంలోని సబ్బు పొడి గోదాములో ఇవాళ ఉదయం భారీ ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన వస్తువులు నష్టపోయాయి.
కేసీఆర్ కు నాలుగు గంటలకు పైగా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన యశోద ఆస్పత్రి వైద్యులు.. మేజర్ సర్జరీ కావడంతో మరింత పర్యవేక్షణ అవసరం అవుతుంది అని డాక్టర్లు తెలిపారు.
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఉక్కు సంకల్పంతో సోనియమ్మ మన ఆకాంక్షలు నెరవేర్చారు.. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో.. మనం చూడలేదు.. కానీ, తెలంగాణ తల్లి సోనియమ్మ రూపంలో ఉంటుందని ఆ తల్లి మనకు భరోసా ఇచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు పుట్టినరోజు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా సోనియా గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ సోనియా గాంధీకి ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు.
డీప్ ఫేక్ వీడియోలపై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తప్పుడు సమాచారంతో వాటిని ఎదుర్కోవడానికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పలు సూచనలు చేశారు.
ఇవాళ రాజస్థాన్లో ముఖ్యమంత్రి పేరును ప్రకటించే విషయంపై బీజేపీ సమావేశం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత రేపు జైపూర్లో శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
జర్మనీలో రైలు డ్రైవర్ల సమ్మెకు దిగారు. లోకో ఫైలెట్స్ జీతాల పెంపు కోసం వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న జీడీఎల్ యూనియన్ గురువారం రాత్రి 24 గంటల సమ్మెను ప్రారంభించింది.
మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఇరాన్ వంటి డజన్ల కొద్దీ దేశాలపై అమెరికా ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. దీంతో పాటు ఉయ్ఘర్ ముస్లింలు, ఇతర మైనారిటీలపై అఘాయిత్యాలకు పాల్పడినందుకు మూడు చైనా కంపెనీల దిగుమతులను కూడా అమెరికా నిషేధించింది.
దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు గ్లోబల్ టెర్రర్ గ్రూప్ ఐఎస్ఐఎస్ కుట్ర చేసిందనే సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ కర్ణాటక, మహారాష్ట్రలోని దాదాపు 44 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.