విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయానికి చేరుకున్న సీఎం జగన్ కు వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు నృత్యాలతో పిల్లలు, నాట్యకారులు అలరించారు. అలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంఖుస్థాపన చేశారు. 216 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులు,131 కోట్ల ఆలయ నిధులు, 5 కోట్ల దాతల నిధులు, 33 కోట్ల ప్రవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
Read Also: Telangana BJP: రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు!.. బరిలో ఈ ముగ్గురు..!
ప్రసాదం పోటు, అన్నప్రసాద భవనం, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, కేశఖండన శాల నిర్మాణం చేశారు. దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాలు.. శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయ పున నిర్మాణానికి 5.60 కోట్లు.. ఇంద్రకీలాద్రి పై కొండ రక్షణ చర్యపనుల నిమిత్తం 4.25 కోట్లు.. ఎల్టీ ప్యానల్ బోర్డులు, ఎనర్జీ వాటర్ మేనేజ్ మెంట్, స్కాడా ఏర్పాటు నిమిత్తం 3.25 కోట్లతో నిర్మించారు. 2016 పుష్కరాల సమయంలో కూల్చివేసిన ఆలయాలను 3.87 కోట్లతో పునర్నిర్మాణం చేస్తున్నారు. మెగా సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు కు 5.66 కోట్లు.. కొండ దిగువున బొడ్డురాయి నిర్మాణం 23 లక్షలు.. కొండ దిగువున తొలిమెట్టు వద్ద రూ.2. 65 కోట్లతో ఆంజనేయ స్వామి, వినాయక స్వామి వార్ల ఆలయ నిర్మాణం చేపట్టారు.
Read Also: Bigg Boss 7 Telugu: తారుమారైన ఓటింగ్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?
ఇక, అమ్మవారి అన్న ప్రసాద భవన నిర్మాణ కు రూ. 30 కోట్లు.. అమ్మవారి ప్రసాదం పోటు భవన నిర్మాణానికి రూ. 27 కోట్లు.. కనకదుర్గ నగర్ నుంచి మహామండపం వరకు 13 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. రాజగోపురం ముందు భాగాన రూ. 15 కోట్లతో మెట్ల నిర్మాణం.. అలాగే, మహామండపం వద్ద అదనపు క్యూలైన్ల కోసం రూ. 23.50 కోట్ల కేటాయించారు. కనక దుర్గ నగర్ వద్ద మహారాజద్వారం నిర్మాణం 7.75 కోట్లు.. కనకదుర్గ నగర్ నుండి మహామండపం వరకు రాజమార్గము అభివృద్ధి నిమిత్తం 7.50 కోట్లు.. కొండపైన పూజా మండపాల నిర్మాణం 7 కోట్లు ఖర్చు చేశారు. మల్లికార్జున మహామండపం క్యూ కాంప్లెక్స్ మార్చుటకు 18.30 కోట్లు.. నూతన కేశఖండన శాల నిర్మాణం నిమిత్తం 19 కోట్లు.. గోశాల అభివృద్ధి నిమిత్తం 10 కోట్లు.. కొండపన యాగశాల నిమిత్తం 5 కోట్లు.. కనకదుర్గ నగర్లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిమిత్తం 33 కోట్ల రూపాలతో అభివృద్ది పనులు చేశారు.