తెలుగు వారికి, తెలంగాణ వారికి, భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నర్సింహ రావు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన భారత దేశాన్ని గాడిన పెట్టీ తన వంతు సేవ దేశానికి అందించారు.. పీవీ ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలి.. ఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలి అని ఆయన డిమాండ్ చేశారు.
ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని కేటీఆర్ వెల్లడించారు. దీంతో ఈరోజు కేటీఆర్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.
సైబరాబాద్ పరిధిలో గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగిందని కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి తెలిపారు. గతేడాది 27, 322 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 29, 156 కేసులు రిజిస్ట్రల్ అయ్యాయి.. మహిళలపై నేరాలు తగ్గాయి.. ఈ ఏడాది 105 హత్య కేసులు నమోదు కాగా, సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి..
ఇవాళ సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం. ఆటో, ఊబర్ వాహానాల డ్రైవర్లతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.
మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు వర్దంతి సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశ ప్రధానిగా, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారు అని చెప్పుకొచ్చారు.
మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు వర్దంతి సందర్భంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లోని పీవీ జ్ఞానభూమి వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివాళులు ఘటించారు.
2024 లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసి దానికి మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని చైర్మన్గా నియమించింది. ఈ మేనిఫేస్టో కమిటీలో 16మంది సభ్యులు ఉంటారు.
భారత్ లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో నెల రోజుల్లో 52 శాతం పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ చేసింది. భారత్ లోనూ కరోనా కేసుల పెరుగుదల కలవర పెడుతుంది.
టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్, ప్రపంచ నెంబర్-1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సుమారు 7 వారాల పాటు ఆటకు దూరం కానున్నారు. చీలమండ గాయం తీవ్రం కావడంతో అతడికి దీర్ఘకాలం విశ్రాంతినివ్వాలని డాక్టర్లు సూచించారు.