గురజాలలో పోటీ చేసే హక్కు నాకు ఉంది.. అందుకే అధిష్టానాన్ని సీటు కోరుతున్నాను అని ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి అన్నారు. గతంలో రెండు సార్లు నేను అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాను.. 2019లో కూడా పార్టీ అవసరాల మేరకే నేను సీటు త్యాగం చేశాను..
ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించడం లేదని అపవాదు వేస్తున్నారు.. మోడీ సర్కార్ భాగ్యస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగడం లేదు అని ఆమె అన్నారు.
ప్రకాశం జిల్లాలో మార్పులపై విజయసాయిరెడ్డి, బాలినేని కసరత్తు చేస్తున్నారు అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొత్త సమన్వయకర్తలను ప్రకటించే అవకాశం ఉంది.
ఇవాళ విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పర్యటించారు. విజయవాడలోని ఓల్డ్ జీజీహెచ్ లో క్రిటికల్ కేర్ బ్లాక్, బీఎస్ఎల్-3 ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు భావజాలాలు నచ్చి పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానించడం జరుగుతుంది అని ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్దరాజు తెలిపారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తామన్నారు.
బెజవాడ సెంట్రల్ సీటు మళ్లీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ఇవ్వాలని నియోజక వర్గ నేతల అంతర్గత సమావేశం అయ్యారు. పున్నమి రిసార్ట్ లో నిన్న 14 మంది కార్పొరేటర్లు, 4 ఇంఛార్జ్ లతో కలిసి భేటీ అయ్యారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో రెండో రోజు పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ అమలాపురం పార్లమెంట్ కు చెందిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కో- ఆర్డినేటర్లతో ఆయన మాట్లాడనున్నారు.
అనకాపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెనాలికి చెందిన కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేయగా.. నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.