మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరాన్ని దర్శించేందుకు ‘ద్వారకా సబ్ మెరైన్ టూరిజం’ ప్రాజెక్టును గుజరాత్ ప్రభుత్వం చేపడుతున్నట్లు ప్రకటించింది.
అదానీ గ్రూప్ పవర్ రంగంలోకి వేగంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే గౌతమ్ అదానీ మరో కంపెనీని విజయవంతంగా సొంతం చేసుకుంది. అయితే, వివరాల్లోకి వెళితే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీ తాజాగా హల్వాద్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్లో 100 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూట్ క్లీయర్ చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలనకు నేటి నుంచి శ్రీకారం చూడుతుంది. ఇవాళ్టి నుంచి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు.
అంగన్వాడీల ఆందోళనల నేపథ్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బహిరంగ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి అంగన్వాడీలకు విఙప్తి చేస్తూ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో అంగన్వాడీలకు ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి వివరించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం హీటెక్కింది. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. తాడిపత్రిలో నగర సుందరీకరణ పనులు చేస్తుంటే వైసీపీ వాళ్లు పార్టీ జెండాలు కట్టారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీస్టేషన్ ముందు రోడ్డుపై పడుకొని జేసీ నిరసన వ్యక్తం చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 11 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, 2006 బ్యాచ్కు చెందిన డీఐజీలకు ఐజీలుగా ప్రమోషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. కొల్లి రఘురామరెడ్డి, సర్వోశ్రేష్ట త్రిపాఠి, అశోక్ కుమార్, విజయ్ కుమార్, హరికృష్ణ, ఎం. రవి ప్రకాష్, రాజశేఖర్, కేవీ మోహన్రావు, రామకృష్ణకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. లిక్కర్ అమ్మకాల వివరాలను ఆన్ లైన్ లో నుంచి తప్పించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
2024 ఎలక్షన్ తర్వాత మళ్ళీ పాత పెద్దారెడ్డిని చూస్తారు మళ్ళీ ఫ్యాక్షన్ చేస్తాను అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి చెప్పారు. కొందరు నాపై సోషల్ మీడియాతో ఏదో మాట్లాడుతున్నాడు వాళ్ళకి 2024 ఎలక్షన్ తర్వాత చూపిస్తా..
వెంటనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కొత్త లైన్లు లాగి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించడంతో కాలనీ వాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. దీంతో మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డికి జంగాళవారు కాలనీ వాసులు అందరూ ధన్యవాదాలు తెలిపి నీ మేలు మరువము నీకు రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు.