నేడు జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8 లక్షల 9 వేల 39 మంది విద్యార్థులకు 584 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి అనేక కారణాల్లో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం. ఈ కుంగుపాటుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి ఉన్న మంచి పేరు కాస్తా పోయింది. దీంతో ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాజెక్టు పేరు ఎత్తడానికే బీఆర్ఎస్ వెనకబడిపోయింది.
ఈ ప్రపంచంలో హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజ్ వేరు లెవల్ అనుకోండి.. మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా బిర్యానీ ప్రియుల నుంచి అనూహ్య స్పందన దొరుకుతుంది. మొన్న స్విగ్గీలో అత్యధిక ఆర్డర్లు పెట్టిన ఆహారంగా కూడా మన హైదరాబాద్ బిర్యానీనే రికార్డులకెక్కి్ంది.
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్‌లోని రైల్వే స్టేషన్ పేరును మార్చేసింది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌కు ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా నామా కరణం చేసింది.
లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు., ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను తమకు అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను అధికారికంగా అభ్యర్థించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
జొమాటోకు రూ. 400 కోట్లు కట్టాలని తెలపగా.. స్వీగ్గీకి రూ. 350 కోట్ల బకాయిలు చెల్లించాలని జీఎస్టీ తెలిపింది. అయితే, ‘డెలివరీ ఛార్జ్’ అనేది ఇంటింటికీ ఆహారాన్ని డెలివరీ చేయడానికి వెళ్ళే డెలివరీ భాగస్వాములు భరించే ఖర్చు తప్ప మరొకటి కాదు అని స్వీగ్గీ, జొమాటో తెలిపాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలపై కేంద్రంలోని మోడీ సర్కార్ దురుద్దేశంతో పని చేస్తోందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ అన్నారు. తమ ప్రభుత్వం ఆరోగ్యం, విద్యారంగంలో చేసిన పనులు నచ్చకపోవడం వల్లే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన శకటాలకు అవకాశం ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు.
తమిళ నటుడు డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి పట్ల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం బాధాకరం.. తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఒక లెజెండ్ అని పేర్కొన్నారు.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో భారీ బహిరంగ సభకు పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది.
హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం పర్యాటకులతో కళకళలాడుతుంది. వరుసగా క్రిస్మస్, న్యూ ఇయర్ రావడంతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి కొండ ప్రాంతానికి భారీగా తరలి వస్తున్నారు.