అనకాపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెనాలికి చెందిన కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేయగా.. నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, అనకాపల్లి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి (గురువారం) 11 నుంచి 12 గంటల ప్రాంతంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు కొడగలి శివరామకృష్ణ తన భార్య, ముగ్గురు కుమార్తెలతో సైనేడ్ తాగి సూసైడ్ చేసుకున్నారు.
Read Also: ‘My Name Is Sruthi’ OTT Release : ఓటీటిలోకి వచ్చేస్తున్న హన్సిక కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కాగా, శివరామకృష్ణతో పాటు భార్య మాధవి, కుమార్తెలు వేద వైష్ణవి, జాహ్నవి లక్ష్మీ మృతి చెందారు. చిన్న కుమార్తె కుసుమ ప్రియ అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ చికిత్స పొందుతుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధ తాళలేక వీరంతా బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు చెప్తున్నారు.