హైదరాబాద్ నగరంలోని 83వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 2, 400 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది.
తెలంగాణలో 30 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది గుండు సున్నా అని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆరు గ్యారంటీలపై వారికే గ్యారంటీ లేదు అని విమర్శలు గుప్పించారు.
బీహార్లోని నవాడాలో సైబర్ మోసం పతాక స్థాయికి చేరుకుంది. గర్భం దాల్చలేని మహిళలను గర్భం దాల్చేందుకు ఒక ఏజెన్సీని నడుపుతున్న ముఠాను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
కొత్త సంవత్సరం రోజు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. మెట్రో కానీ, ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదు అని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాను.
కొత్త సంవత్సరం శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజానీకంతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలకు, యవత్తు దేశ ప్రప్రంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలను రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
దరాబాద్ నగరంలోని అబిడ్స్ ఓ హోటల్ లోని బిర్యానీ విషయంలో తలెత్తిన గొడవ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ బిర్యానీలోని మటన్ సరిగ్గా ఉడకలేదని వారి ఆవేదన వ్యక్తం చేశారు. దానికి తాము పూర్తి డబ్బులు చెల్లించలేమని హోటల్ వెయిటర్లతో వినియోగదారులు గొడవకు దిగారు.
రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైకి రేవంత్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు పలువురు అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఒక పార్టీ అధ్యక్షుడిపై గెలిచినపుడు గొప్పగా అనిపించింది.. ఇపుడు చూస్తుంటే చాలా మామూలు వ్యక్తిపై గెలిచినట్టు ఉంది అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పార్టీ పెట్టినప్పుడు చేగువేరాతో పాటు మహనీయుల ఫోటో పెట్టుకున్న పవన్ ఇపుడు అవి తీసేసి.. చంద్రబాబు ఫోటో పెట్టుకున్నారు.. చంద్రబాబులో పవన్ కళ్యాణ్ కి చేగువేరా కనిపిస్తున్నాడు అని ఆయన ఎద్దేవా చేశారు.