E-Commerce Policy: జాతీయ ఈ-కామర్స్ పాలసీ తుది దశకు చేరుకుందని.. దీన్ని త్వరలో విడుదల చేయబోతున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్ తెలిపారు. ఆగస్టులో ఈ పాలసీకి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(DPIIT) ఈ-కామర్స్ సంస్థల ప్రతినిధులు, దేశీయ వ్యాపారుల సంఘంతో చర్చలు జరిపింది. అయితే, ఈ అంశం ప్రస్తుతం ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయిలో చివరి దశకు చేరుకుంది. దీన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. జాతీయ రిటైల్ వాణిజ్య విధానంపై కూడా డీపీఐఐటీ పని చేయనుందని పీయూష్ గోయల్ వెల్లడించారు.
Read Also: Prabhas Maruthi Movie Update : గెట్ రెడీ అబ్బాయిలూ.. డార్లింగ్ గా మారనున్న డైనోసర్
అయితే, మంత్రిత్వ శాఖ రెండు జాతీయ ఈ- కామర్స్ విధానాల ముసాయిదాను విడుదల చేసింది అని కేంద్ర పరిశ్రమల మంత్రిత్వశాఖ పీయూష్ గోయల్ తెలిపారు. 2019 డ్రాఫ్ట్ ఈ- కామర్స్ పర్యావరణ వ్యవస్థ యొక్క ఆరు విస్తృత రంగాలను కవర్ చేసింది. డేటా, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్, రెగ్యులేటరీ సమస్యలు, దేశీయ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రమోషన్ లాంటి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. ఎగుమతులతో పాటు ఈ-కామర్స్ ద్వారా ఎగుమతి ప్రమోషన్ వంటివి జాతీయ రిటైల్ ట్రేడ్ పాలసీపై కూడా డీపీఐఐటీ పని చేస్తోందని పీయూష్ గోయల్ చెప్పారు.