ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపలో టికెట్ దక్కని వారు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో పక్క పార్టీల్లో నుంచి అధికార వైసీపీలోకి కూడా వస్తున్నారు. అయితే, తాజాగా విజయవాడలో సంక్రాంతి పండగ రోజు ఫ్లెక్సీ వార్ కొనసాగుతుంది. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పార్థసారథి, ఎంపీ కేశినేని నాని టార్గెట్ గా ఫ్లెక్సీల వార్ సాగుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్కు ఆనవాయితీగా వస్తుంది. అయితే, ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
మరోసారి వైసీపీ వస్తే రాష్ట్ర భవిష్యత్ చీకటే.. రాజధాని రైతులకున్న కీడు, పీడ తొలగిపోయే రోజులు దగ్గర ఉన్నాయి.. రాజధాని రైతులు పడ్డ కష్టం ఇబ్బందులను తీర్చడానికి టీడీపీ - జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. ఇవాళ్టీ నుంచి 87 రోజులే.. కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. లెక్క పెట్టుకోండి అని పేర్కొన్నారు. దేవతల రాజధానిని రాక్షసులు చెరపట్టినట్టు.. అమరావతిని వైసీపీ చెరబట్టింది.. అమరావతే మన రాజధాని.. త్వరలో ఇక్కడ నుంచే పేదల పాలన మొదలు కాబోతోంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా భోగి వేడుకలు జరిగాయి. భోగి ప్రతి ఇంట భోగభాగ్యాలు కలిగించాలని కోరుతూ భక్తి పార్వసంగా సంబరాలు జరిగాయి. భోగి మంటలను వెలిగించి వేడుకలను ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ప్రారంభించారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరు నాన్ లోకల్ నేతలు భోగి వేస్తున్నారు అని ఆమె విమర్శలు గుప్పించారు. భోగి పండగ, 2024 ఎన్నికలు అవ్వగానే మళ్ళీ హైదరాబాద్ కు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వెళ్ళిపోతారు.. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు, పవన్ లను తగలబెట్టి, తరిమేయండి అని మంత్రి రోజా పిలుపునిచ్చారు.
పల్నాడు జిల్లా సత్తనపల్లి గాంధీ బొమ్మల సెంటర్లో మంత్రి అంబటి రాంబాబు అధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంక్రాంతి వేడుకలకు ప్రజలు భారీగా హాజరు అయ్యారు. భోగి వేడుకలలో భాగంగా మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేక డాన్స్ చేశాడు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయ్యాయి. మూడ్రోజుల పాటు సాగే ఈ సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె, పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేసుకుని.. వాటి చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు.