Sadhus: బెంగాల్ లో సాధులపై దాడి.. టీఎంసీపై బీజేపీ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాలో గంగా సాగర్‌కు వెళ్తున్న సాధువులను చూసిన కొందరు పిల్లలను ఎత్తుకెళ్తారనుకొని చితకబాదారు. ఈ ఘటన పురులియా జిల్లాలో చోటు చేసుకుంది. అయితే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు సాధువులు మకర సంక్రాంతి సందర్భంగా బెంగాల్ లో నిర్వహించే గంగాసాగర్ మేళాకు కారులో వస్తున్నారు.. పురిలియా జిల్లాకు చేరుకున్నారు.. అక్కడ దారి తప్పిన వాళ్లు.. రూట్ గురించి ఇద్దరు మైనర్ బాలికలను అడిగారు.. అయితే వాళ్లు భయపడి కేకలు వేయడంతో స్థానకంగా ఉన్న కొందరు వచ్చి ఆ సాధువులను పట్టుకొని కొట్టారు.
Read Also: Allu Arjun: సోషియో ఫాంటసీ డ్రామాతో మాంత్రికుడు రెడీ?
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సాధువులను రక్షించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పురూలియా ఎస్పీ అభిజిత్ బెనర్జీ చెప్పుకొచ్చారు. సాధువులపై దాడి చేసిన వారిని గుర్తించాం.. వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. అక్కడ ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇక, ఈ వీడియోపై భారతీయ జనతా పార్టీ మమత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: Winter Storm: అమెరికాలో తుఫాన్ దెబ్బకు రెండు వేల విమానాలు రద్దు..
రాష్ట్రంలో హిందూవులపై దాడి జరుగుతున్న కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా వ్యాఖ్యనించారు. ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ.. “మమతా బెనర్జీ మౌనంగా ఉండటం దారుణం! ఈ హిందూ సాధువులు మీకు కనిపించడం లేదా? అని విమర్శించారు. ఈ సంఘటనను 2020లో జరిగిన మహారాష్ట్రలోని పాల్ఘర్ మాబ్ లించింగ్‌తో పోల్చుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ పాలనలో షాజహాన్ షేక్ వంటి ఉగ్రవాదులకు రక్షణ లభిస్తుంది.. కానీ, సాధువులు మాత్రం చంపబడుతున్నారు అని అమిత్ మాల్వియా విమర్శలు గుప్పించారు.
Outraged by the Purulia incident! Sadhus en route to Gangasagar brutally attacked—shocking evidence of deteriorating safety under TMC. Mamata's regime shields terrorists like Shahjahan Sheikh, while sadhus face brutal lynching. A grim reality for Hindus in Bengal. #SaveBengal https://t.co/0O6TJAbwqE
— Locket Chatterjee (@me_locket) January 12, 2024
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!