తూర్పు లడఖ్లో చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే మాట్లాడుతూ.. భారత సైన్యం తన సరిహద్దుల్లో పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు.
భారతదేశంలోని గిరిజనుల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ పీఎం జన్మన్ పథకం(ఆదివాసుల అభివృద్ధి పథకం) పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నారు. తొలి విడతలో 100 జిల్లాల్లో ఈ పథకాన్ని ఆరంభించనున్నారు.
శబరిమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఇవాళ మకర జ్యోతి దర్శనం కోసం లక్షల సంఖ్యలో అయ్యప్ప స్వాములు వేచి చూస్తున్నారు. అత్యధిక మంది భక్తులు చేరుకోవడంతో శబరి కొండలు స్వామి శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగిపోతున్నాయి.
ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు విమానం ఆలస్యానికి సంబంధించి ప్రకటన చేస్తుండగా పైలట్పై దాడి చేశాడు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పాకిస్థాన్ ప్రజలు మరోసారి ద్రవ్యోల్బణం భారాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ లో ధరలకు సంబందించిన వివరాలను లాహోర్లో పాక్ ఆర్థిక మంత్రి ప్రకటించారు.
ఉత్తర కొరియా ఒక ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అది కొరియా ద్వీపకల్పంతో పాటు జపాన్ మధ్య సముద్రంలో పడిపోయింది. ఈ క్షిపణి ఈ ప్రాంతంలోని రిమోట్ ద్వారా అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేకుని ప్రయోగించింది.
ముత్యాల ముగ్గులు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
కోడి పందేలను వీక్షించడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు కూడా వస్తారంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో కోడి పందేల నిర్వాహకులు తమ పుంజులను బరిలోకి దించేందుకు రెడీ అవుతున్నారు.
సంక్రాంతి పండగ కోసం హైదరాబాద్ నగరం నుంచి భారీగా తరలి తమ సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. అయితే, సొంతూర్లకు వెళ్లే పనిలో ప్రయాణికులు ఉంటే.. దొంగలు మాత్రం తమ చేతివాటానికి పని చెప్తున్నారు. జూబ్లీ బస్టాండ్ పరిధిలో ఈ మూడు రోజుల్లో అనేక సెల్ ఫోన్స్ చోరీకి గురయ్యాయి.