US presidential election: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి అమెరికాలో అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్నారు. ఈ బయోటెక్ వ్యవస్థాపకుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి నేను ఈ అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ఆపబోతున్నాను అని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేసి ఆయన విజయం సాధించినందుకు అభినందనలు తెలుపినట్లు ప్రకటించారు. ట్రంప్ అధ్యక్ష పదవికి నా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు.
Read Also: Central Govt: బ్రిటన్ కు విచారణ సంస్థలు.. నీరవ్ మోడీ, విజయ్ మాల్యాను తీసుకొస్తారా..?
ఇక, డోనాల్డ్ ట్రంప్ విజయంతో అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించడానికి అయోవాలోని రిపబ్లికన్ కౌకస్‌లో జరిగిన ఓటింగ్‌లో నాలుగో స్థానం దక్కించుకోవడం వల్ల ఈ రామస్వామి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, గత ఏడాది ఫిబ్రవరిలో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పదవి రేసులో చేరనున్నట్లు రామస్వామి ప్రకటించారు. అప్పట్లో ఆయన రాజకీయ వర్గాల్లో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అయితే, ఇమ్మిగ్రేషన్ తో పాటు అమెరికా వంటి సమస్యలను లేవనెత్తడం ద్వారా అతను రిపబ్లికన్ ఓటర్లలో తన స్థానాన్ని త్వరగా నిరూపించుకోగలిగాడు. కానీ, రామస్వామి ఈ ఎన్నికల ప్రచారం డొనాల్డ్ ట్రంప్ మాదిరిగానే ఉంది. గత ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపించిన సంప్రదాయవాద ఓటర్లను రామస్వామి తన వైపుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.