సిరియా, నార్తన్ ఇరాక్ ప్రాంతాలపై ఇరాన్ దాడులకు దిగింది. సిరియా, ఇరాక్ ఆధీనంలోని స్వయం ప్రతిపత్తి కలిగిన కుర్దిస్థాన్ ఏరియాలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని క్షిపణిలతో దాడులు చేసింది. ఇజ్రాయెల్ గూఢచార బృందాల భేటీపై దాడి జరిపినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ గ్రూప్స్ పేర్కొనింది. ఇందులో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు చెప్పుకొచ్చాయి.
Read Also: Hanuman: 3 మిలియన్ డాలర్స్… డేంజర్ లో ఆదిపురుష్, సాహూ సినిమాల రికార్డ్స్
అయితే, ఈ దాడిలో మరణించిన పలువురు పౌరుల్లో ప్రముఖ వ్యాపారవేత్త పెష్రా డిజాయీ కూడా ఉన్నారని కుర్దిస్థాన్ డెమోక్రటిక్ పార్టీ వెల్లడించింది. బాలిస్టిక్ క్షిపణులతో సిరియాలోని పలు ప్రాంతాలపై కూడా ఇరాన్ దాడి చేసింది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్స్ కమాండర్లకు చెందిన స్థలాలపై ఈ దాడి జరిగాయి. ఇరాన్‌లోని కెర్మాన్, రాస్క్‌లలో ఇటీవల ఉగ్రవాదులు జరిపి పలువురు ఇరాన్ దేశస్థులను చంపేశారు. ఆ దాడులకు ప్రతీకారంగా సిరియాపై ఇరాన్ క్షిపణులతో ఈ దాడులు చేసింది.
Read Also: Jagganna Thota Prabhala Theertham: నేడు జగ్గన్నతోట ప్రభల తీర్థం..
అలాగే, సిరియాకు చెందిన అలెప్పో గ్రామీణ ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. మధ్యధరా సముద్రం వైపు నుంచి 4 క్షిపణులు వచ్చినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వార్ మానిటర్ చెప్పుకొచ్చింది. సిరియా, ఇరాక్ ఆధీనంలోని కుర్దిస్థాన్ ఏరియాలో ఇజ్రాయెల్ గూఢచారి బృందాల కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఇరాన్ ఆరోపలు చేస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తున్న ఇరాన్ ఈ మేరకు దాడులు చేసింది.