Kuno National Park: కునో నేషనల్ పార్క్‌లో మూడు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Namibian Cheetah: కునో నేషనల్ పార్కులో చీతా పిల్లలు సందడి చేస్తున్నాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాలా అనే చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. అయితే, కొత్తగా పుట్టిన చీతా కూనలకు సంబంధించిన ఓ వీడియోని కూడా ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. తల్లి పొత్తిళ్లలో అవి ఆడుకుంటూ కనబడుతున్నాయి. అయితే, 20 రోజుల క్రితం (జనవరి 3న) నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆశా అనే చీతా కూడా మూడు పిల్లలకు జన్మనిచ్చింది.
Read Also: Fighter: 166 నిమిషాల స్టన్నింగ్ ఏరియల్ యాక్షన్…
Also Read
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
ఇక, 2023 మార్చిలో జ్వాలా చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, వాటిలో ఒకటి మాత్రమే ప్రాణాలతో ఉంది. ఇక, కొత్తగా పుట్టిన ఈ మూడు పిల్లలతో కలిపి కునో నేషనల్ పార్క్‌లో మొత్తం చిరుతల సంఖ్యను 20కి చేరుకుంది. కాగా, కునో నేషనల్ పార్క్‌లో చీతాలు ఒకటి తర్వాత మరొకటి వరుసగా మరణిస్తున్నాయి. గత మంగళవారం (జనవరి 16న) శౌర్య అనే చీతా చనిపోయింది. దీంతో నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో 2022 నుంచి ఇప్పటి వరకు వరుసగా 10 చీతాలు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. వీటిలో 7 పెద్ద చీతాలు కాగా, మూడు కూనలు ఉన్నాయి. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి రెండు దఫాలుగా భారత్‌కు ఈ చీతాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వదిలి పెట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వివిధ కారణాలతో ఈ చీతాలు ఒక్కొక్కటిగా మరణించటం స్టార్ట్ అయింది.
A Namibian Cheetah named Jwala has given birth to three cubs. This comes just weeks after Namibian Cheetah Aasha gave birth to her cubs.
Union Environment Minister Bhupender Yadav shares the video on his 'X' handle. pic.twitter.com/dgOsISpTU0
— ANI (@ANI) January 23, 2024
తాజావార్తలు
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!