నల్లగొండ లోక్ సభ నియోజక వర్గ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అంటున్నారు.. బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్ష లు మొదలవుతాయి.. మనం ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదు.. కాంగ్రెస్ వాళ్ళు ఉలికి పడుతున్నారు అని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఉహించుకోండి.. కార్యకర్తలు ఉదాసీన వైఖరి వీడాలి.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గత నవoబర్ లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారు.. నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటి రెడ్డి కే పంపండి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Read Also: Hanu Man Collections: రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను రాబట్టిన ‘హనుమాన్’.. 10 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
నాగార్జున సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలనలో మొదటి సారి క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి దాపురించింది అని కేటీఆర్ తెలిపారు. శ్రీ రాం సాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండ బెడుతోంది.. కరెంటు కోతలు అపుడే మొదలు అయ్యాయి.. కాంగ్రెస్- బీజేపీ అక్రమ బంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయట పడింది అని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి భుజం మీద తుఫాకీ పెట్టి ప్రధాని నరేంద్ర మోడీ బీఆర్ఎస్ ను కాలుస్తారట.. మైనారిటీ సోదరులకు కాంగ్రెస్- బీజేపీ అక్రమ సంబంధం గురించి చెప్పాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు.