మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒక మంచి ఎన్నికల మేనిఫెస్టో అందించగలిగాము.. రాష్ట్రంలో అన్నింటికంటే మంచి మేనిఫెస్టో ఇవ్వగలిగాము అని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు ఇచ్చాం.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.
పదేళ్లు వారికి ఉద్యోగాలు ఇవ్వకూండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.. ఇప్పుడు నిరుద్యోగులను కేసీఆర్ ఇంటికి పంపాలా.. కేటీఆర్ ఇంటికి పంపాలా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు (సోమవారం) ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న ( జనవరి 22న) పలు ఉత్తరాది రాష్ట్రాల్లో నాన్వెజ్ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది.
రాంలాలా ప్రాణప్రతిష్ట సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై రాముడి ప్రతిరూపాన్ని ప్రదర్శించే ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే, ఇంతకీ ఈ చిత్రం నిజమా? లేక ఎడిట్ చేసిన ఫోటో వైరల్ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
దేశ ప్రజలు రామ్ లల్లా దర్శనం చేసుకునేలా ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించబోతోంది. బీజేపీ శ్రీరామజన్మభూమి దర్శన ప్రచారం రేపటి నుంచి ప్రారంభం కానుంది. అయోధ్యకు చెందిన కమలం పార్టీ నాయకులకు పార్టీ హైకమాండ్ పనులు అప్పగించింది.
ఐక్యరాజ్యసమితి పని తీరుపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐరాసతో పాటు దాని అనుబంధ సంస్థల్లో మార్పులు చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపాడు. ఈ సందర్భంగా భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించాడు.
విదేశీయులు, శరణార్థులకు భారత పాస్ పోర్టులు ఇప్పించిన ముఠా గుట్టురట్టు అయింది. 92 మందికి నకిలీ పాస్ పోర్టులు ఇప్పించి గల్ఫ్ దేశాలకు పంపించారు. ఇక, తెలంగాణ సీఐడీ అధికారులు ఈ ముఠాకు సహకరించిన కొందరిని అరెస్టు చేశారు.
కునో నేషనల్ పార్కులో చీతా పిల్లలు సందడి చేస్తున్నాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాలా అనే చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు.
అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు భారీగా వచ్చారు. రామభక్తులు వేకువజామున 3 గంటలకే పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు.
అగ్రరాజ్యం అమెరికా కాల్పుల ఘటనలతో వణికిపోతోంది. తాజాగా, యూఎస్ లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఇల్లినాయిస్లోని చికాగోలో రెండు ఇళ్లపై కాల్పులు జరిపిన ఓ దుండగుడు ఎనిమిది మంది ప్రాణాలు తీశాడు.