గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రేపు (గురువారం) భారత్‌కు రానున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌కు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకాబోనున్నారు.
హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర కలవరపెడుతున్నాయి. తాజాగా ఇవాళ మింట్ కాంపౌండ్ ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కేస్ లో పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. పంజాగుట్ట కేస్ తో పాటు జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేస్ వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ పరిశీలిస్తున్నారు.
రాహుల్ గాంధీతో పాటు భారత్ జోడో న్యాయ యాత్రకు భద్రత కల్పించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ బోర్డు ఇవాళ విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలలో దర్శనాల కోసం నేడు టికెట్లు జారీ చేయనుంది.
మెదక్ జిల్లాలోని చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రిని చంపేసి సహజ మరణంగా కొడుకు, కూతురు, అల్లుడు చిత్రీకరించారు. కాగా, మృతుడి భార్య లచ్చవ్వ ఫిర్యాదుతో ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
సోమాలియాపై నిన్న (మంగళవారం) అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ముగ్గురు అల్-ఖైదా-సంబంధిత అల్-షబాబ్ మిలిటెంట్లు మరణించారు. పౌరులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు అని యూఎస్ ఆర్మీ తెలిపింది.
న్యూ హ్యాంప్‌షైర్‌లో డోనాల్డ్ ట్రంప్‌కు 55 శాతం ఓట్లు వచ్చాయి. ఇక, రెండవ స్థానంలో నిక్కి హేలీ నిలిచింది. గత వారం క్రితం ఐయోవాలో జరిగిన ప్రైమరీలో కూడా ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. న్యూ హ్యాంప్‌షైర్‌లో 22 మంది డిలీగేట్స్ ఉండగా.. అందులో ట్రంప్ 11, హేలీ 8 గెలుచుకున్నాట్లు టాక్.
చైనీస్ నౌక జావా-సుమత్రా మధ్య ఉండే సుండా జలసంధిని దాటిన తర్వాత ప్రస్తుతం హిందూ మహాసముద్రం రీజియన్‌లోని ఇండోనేషియా తీరంలో ప్రయాణిస్తుందని మైరెన్ ట్రాకర్ యాప్ పేర్కొనింది.