Zomato: ప్రాణప్రతిష్ఠ వేళ నాన్‌వెజ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన జొమాటో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Non Vegetarian Food: అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు (సోమవారం) ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న ( జనవరి 22న) పలు ఉత్తరాది రాష్ట్రాల్లో నాన్‌వెజ్ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. అయితే, సోమవారం రోజు శ్రీరామ జన్మభూమి అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో శ్రీరాముడు బాలావతారంలో కొలువుదీరాడు. ఈ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా పలు రాష్ట్రాలు మాంసం విక్రయాలను నిషేదం విధించాయి. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ కస్టమర్ చికెన్ కోసం జొమాటో యాప్‌లో
సెర్చ్ వేయగా.. నాన్‌వెజ్ ఫుడ్ అందుబాటులో కనిపించలేదు..
Read Also: Nithiin: మోసగాడిని రివీల్ చేయబోతున్నారు…
Also Read
దీంతో అతడు ‘ఈరోజు (జనవరి 22న) భోపాల్‌లో జొమాటో సంస్థ చికెన్ డెలివరీ చేయడం లేదు’ అని ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే, జొమాటో దీనికి సమాధానం ఇస్తూ.. ప్రాణ ప్రతిష్ట సమయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నాన్ వెజ్‌ను తాత్కాలికంగా నిషేధించినట్లు వెల్లడించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నాన్‌వెజ్‌ను డెలివరీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక, జొమాటో నిర్ణయంపై సర్వత్రా ప్రసంశలు వస్తున్నాయి.
Hi, we have disabled delivery of non-veg items in Uttar Pradesh, Assam, Chhattisgarh, Madhya Pradesh and Rajasthan as per govt. notice. Hope this clarification helps!
— Zomato Care (@zomatocare) January 22, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!